బిజినెస్

స్వేచ్ఛగా హోప్ ఐలాండ్, మడ అడవుల్లో విహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, డిసెంబర్ 13: ప్రకృతి సహజసిద్ధంగా ఏర్పడిన హోప్ ఐలాండ్ సహా కోరంగి అభయారణ్యం (మడ అడవులు), కాకినాడ సాగర జలాల్లో విహరించాలనుకునే వారి కల త్వరలోనే సాకారం కానుంది. ఈ మూడు ప్రాంతాలను ఒక టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ధిచేసి, బోటు షికారు సౌకర్యం కల్పించనున్నారు.
కాకినాడ బీచ్-హోప్ ఐలాండ్, కోరంగి మడ అడవుల్లో పర్యటించడానికి ప్రత్యేక ప్యాకేజీని 2017 జనవరి నుండి అమలు చేస్తారు. ఇప్పటికే కోరంగి అభయారణ్యంలో విహరించడానికి పర్యాటక శాఖాధికారులు బోట్లు నడుపుతున్నారు. ఇకపై కాకినాడ బీచ్ నుండి హోప్ ఐలాండ్ మీదుగా కోరంగి అభయారణ్యాన్ని తిలకించి వచ్చేలా ప్రత్యేక బోటు షికారు ప్యాకేజీ రూపొందిస్తున్నారు. అలాగే ఈ మూడు టూరిజం స్పాట్స్‌లో ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారు. బీచ్‌లో సుమారు 3 వేల మందికి సరిపోయే అమ్యూజ్‌మెంట్ పార్క్, మ్యూజియం నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఎకో ఫ్రెండ్లీ ఫుడ్ కోర్టులు, ల్యాండ్ స్కేపింగ్ తదితర సౌకర్యాలు కల్పిస్తారు. కోరంగి అభయారణ్యంలో టూరిజం స్పాట్స్ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. 2017 జనవరిలో నిర్వహించే బీచ్ ఫెస్టివల్ నాటికి పలు వసతులను పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. బీచ్ ఫెస్టివల్‌ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని, వచ్చే సంక్రాంతికి బీచ్ పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. రెండేళ్లుగా కాకినాడ బీచ్ ఫెస్టివల్‌ను రాష్ట్ర స్థాయి ఉత్సవంగా నిర్వహిస్తున్నారు. టూరిజం ప్రమోషన్‌లో భాగంగా జరిగే బీచ్ ఫెస్టివల్‌లో పెద్ద ఎత్తున వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. జిల్లాలోని వివిధ పర్యాటక ప్రాంతాలను నాలుగు టూరిజం సర్య్కూట్లుగా అభివృద్ధి చేయనున్న నేపథ్యంలో ఇందుకు అవసరమైన ప్రణాళికలను కూడా అధికారులు సిద్ధం చేశారు. కోనసీమలో దిండి, బోడసకుర్రు సహా వివిధ ప్రాంతాల్లో లంకలను కలుపుతూ పర్యాటక సర్క్యూట్‌గా అభివృద్ధి చేస్తారు. అఖండ గోదావరి టూరిజం సర్క్యూట్ కింద రాజమహేంద్రవరంలోని కోటిలింగాల రేవు, పిచ్చుకలంక, హేవ్‌లాక్ వంతెనల అభివృద్ధి, ఏజన్సీలోని మారేడుమిల్లి అటవీ అందాలు, రంపచోడవరంలో జలపాతాలను పర్యాటక కేంద్రాలుగాను, రిజర్వాయర్ పరిసరాలను టూరిజం స్పాట్స్‌గా తీర్చిదిద్దడానికి టూరిజం సర్క్యూట్ కింద అభివృద్ధి పనులు చేపడుతున్నారు.

చిత్రాలు..హోప్ ఐలాండ్, కోరంగి అభయారణ్యం దృశ్యాలు