బిజినెస్

దేశీయ మార్కెట్‌లోకి త్వరలో నోకియా ఫోన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: టాబ్లెట్లు, మొబైల్ ఫోన్ల కోసం నోకియాతో బ్రాండ్ లైసెన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకున్న హెచ్‌ఎమ్‌డి గ్లోబల్.. వచ్చే జనవరి-మార్చి త్రైమాసికంలో భారతీయ మార్కెట్‌లోకి రెండు సరికొత్త ఫీచర్ ఫోన్లను తీసుకురానుంది. ఈ నోకియా 150, నోకియా 150 డ్యూయల్ సిమ్ ఫోన్ల ధర 2,000 రూపాయల దిగువనే ఉంటుందని హెచ్‌ఎమ్‌డి సంస్థ ఓ ప్రకటనలో తెలియజేసింది.
పలు విదేశీ మార్కెట్లలోనూ వీటిని విడుదల చేయనున్నారు. 2.4 అంగుళాల స్క్రీన్ కలిగిన ఈ ఫోన్లలో ఎఫ్‌ఎమ్ రేడియో, ఎమ్‌పి3 ప్లేయర్, వివిధ రకాల గేమ్స్ అందుబాటులో ఉంటాయి. 22 గంటలపాటు టాక్‌టైమ్ కలిగిన బ్యాటరీ సామర్థ్యం దీని సొంతం.