బిజినెస్

ఆకట్టుకున్న ఆటో, ఐటి షేర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 13: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. అమెరికా రిజర్వ్ బ్యాంకైన ఫెడ్ రిజర్వ్.. వడ్డీరేట్లను పెంచే వీలుందన్న సంకేతాలున్నప్పటికీ మదుపరులు కొనుగోళ్లకు పెద్దపీట వేశారు. ఆటో, ఐటి, చమురు, గ్యాస్ రంగాల షేర్లు ఆకట్టుకోవడంతో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 182.58 పాయింట్లు పుంజుకుని 26,697.82 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 51 పాయింట్లు అందుకుని 8,221.80 వద్ద నిలిచింది. అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంక్, విప్రో, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్‌అండ్‌టి, సన్ ఫార్మా షేర్లు లాభపడ్డాయి. గెయిల్, టాటా స్టీల్, లుపిన్, హిందుస్థాన్ యునిలివర్ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో జపాన్, చైనా, హాంకాంగ్ సూచీలు లాభపడితే, ఐరోపా మార్కెట్లలో ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సూచీలు నష్టపోయాయి.