బిజినెస్

జూలై-సెప్టెంబర్‌లో తగ్గిన కరెంట్ ఖాతా లోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 13: దేశ జిడిపిలో కరెంట్ ఖాతా లోటు (సిఎడి) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో 0.6 శాతానికి తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) జూలై-సెప్టెంబర్‌లో ఇది 1.7 శాతంగా ఉంది. ఈ మేరకు మంగళవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) తెలియజేసింది. ఈసారి జూలై-సెప్టెంబర్‌లో దేశ జిడిపి (స్థూల దేశీయోత్పత్తి)లో కరెంట్ ఖాతా లోటు 3.4 బిలియన్ డాలర్లుగా నమోదైందని, గత జూలై-సెప్టెంబర్‌లో ఇది 8.5 బిలియన్ డాలర్లుగా ఉందని వివరించింది. అయినప్పటికీ ఈ ఏప్రిల్-జూన్ జిడిపిలో నమోదైన కరెంట్ ఖాతా లోటుతో చూస్తే జూలై-సెప్టెంబర్‌లో నమోదైనది 0.3 బిలియన్ డాలర్లు అధికమని పేర్కొంది.