బిజినెస్

నాస్కాం, ఐబిఎం టెక్‌స్టార్టప్ అంకురం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 15: స్టార్టప్ వాణిజ్యానికి ఊతం ఇచ్చే విధంగా నాస్కాం, ఐబిఎం సంస్ధలు గురువారం ఇక్కడ టెక్‌స్టార్టప్.ఇన్ అనే స్టార్టప్‌ను ప్రారంభించాయ. ఈ సందర్భంగా నాస్కాం ఉపాధ్యక్షుడు కెఎస్ విశ్వనాథం మాట్లాడుతూ, నగరంలోని అన్ని స్టార్టప్‌లతో అనుసంధానమై తాజా సాంకేతిక పరిజ్ఞానంతో ఈ రంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ప్రతిభ, వౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామన్నరు. డిజిటల్ ప్రపంచం విస్తరణకు టెక్‌స్టార్టప్ ఉపయోగపడుతుందన్నారు. దేశంలో అన్ని రంగాలు డిజిటలైజేషన్ అవుతున్న తరుణంలో హైదరాబాద్‌లో అన్ని హంగులు, టెక్నాలజీతో టెక్‌స్టార్టప్‌ను ప్రారంభించామన్నారు. తొలుత బెంగళూరు, డిల్లీ, ముంబాయి తర్వాత హైదరాబాద్‌లో దీనిని ఏర్పాటు చేశామన్నారు. వచ్చే దశలో టూ, త్రీ టైర్ నగరాలకు స్టార్టప్‌లను విస్తరిస్తామన్నారు. ఐబిఎం ఇండియా ఎకో సిస్టమ్ డెవలప్‌మెంట్ కంట్రీ మేనేజర్ సీమా కుమార్ మాట్లాడుతూ స్టార్టప్ ఎకో సిస్టమ్‌ను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.