బిజినెస్

ఎండిఆర్ చార్జీలను భరించనున్న సర్కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: డెబిట్ కార్డులు లేదా క్రెడిట్ కార్డుల ద్వారా వసూలయ్యే పన్నులు, ఇతర ప్రభుత్వ రాబడులపై బ్యాంకులకు ఎండిఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేట్) చార్జీలను తిరిగి చెల్లించేందుకు (రీయింబర్స్‌మెంట్‌కు) బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఆర్థిక శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రాబడులకు సంబంధించిన అన్ని రకాల లావాదేవీలపై బ్యాంకులకు ఎండిఆర్ చార్జీలను చెల్లించేందుకు అవసరమైన బడ్జెట్ కేటాయింపులను బడ్జెట్ విభాగం కేటాయిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ ఒక సర్క్యులర్‌లో స్పష్టం చేసింది. దీంతో డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల ద్వారా పన్నులు, ఇతర రాబడుల్లాంటి ప్రభుత్వ బకాయిలను వసూలుచేసే బ్యాంకులు ఎండిఆర్ చార్జీలకు సంబంధించిన క్లెయిమ్‌లను నిర్ణీత కాల వ్యవధిలో రిజర్వు బ్యాంకుకు సమర్పించాల్సి ఉంటుంది. క్రెడిట్/డెబిట్ కార్డుల ద్వారా వసూలయ్యే ప్రభుత్వ రాబడులపై బ్యాంకులకు చెల్లించాల్సిన ఎండిఆర్ చార్జీలను బడ్జెట్ కేటాయింపుల ప్రకారం రిజర్వు బ్యాంకు చెల్లిస్తుంది.