బిజినెస్

3 వారాల కనిష్టానికి సూచీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 9: మదుపరులు లాభాల స్వీకరణపై దృష్టి పెట్టడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు గడచిన వారం 3 వారాల కనిష్ట స్థాయికి పతనమయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 595.80 పాయింట్లు నష్టపోయి 24,673.84 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 157.85 పాయింట్లు పడిపోయి 7,555.20 వద్ద నిలిచింది. బ్యాంకింగ్, ఆటో, ఎఫ్‌ఎమ్‌సిజి, ఐటి, కన్జ్యూమర్ డ్యూరబుల్, క్యాపిటల్ గూడ్స్, టెక్నాలజీ, రియల్టీ రంగాల షేర్లు భారీగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బిఎస్‌ఇ మిడ్-క్యాప్ 0.45 శాతం నష్టపోగా, స్మాల్-క్యాప్ 0.23 శాతం లాభపడింది. టర్నోవర్ విషయానికొస్తే గడచిన వారం బిఎస్‌ఇ 12,034.70 కోట్ల రూపాయలుగా ఉంటే, ఎన్‌ఎస్‌ఇ 73,075.11 కోట్ల రూపాయలుగా ఉంది. అంతకుముందు వారం బిఎస్‌ఇ టర్నోవర్ 13,792.46 కోట్ల రూపాయలుగా ఉంటే, ఎన్‌ఎస్‌ఇ టర్నోవర్ 96,66 8.10 కోట్ల రూపాయలుగా ఉంది. మరోవైపు విదేశీ మదుపరులు గడచిన వారం 859.87 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులను అమ్మేసినట్లు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ తెలియజేసింది.