బిజినెస్

ఇపిఎఫ్‌పై 8.8% వడ్డీ కొనసాగించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఇపిఎఫ్‌ఓ)లోని నాలుగు కోట్ల మందికిపైగా చందాదారుల ఇపిఎఫ్ డిపాజిట్లపై ప్రస్తుతం చెల్లిస్తున్న 8.8 శాతం వడ్డీని ప్రస్తుత (2016-17) ఆర్థిక సంవత్సరంలో కూడా అలాగే కొనసాగించాలని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ కోరుతోంది. ఈ విషయమై ఆర్థిక శాఖను ఒప్పించేందుకు కార్మిక శాఖ ప్రయత్నిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇపిఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 8.8 శాతం నుంచి 8.7 శాతానికి తగ్గించాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఇందుకు కార్మిక శాఖ నేతృత్వంలోని ఇపిఎఫ్‌ఓ ట్రస్టీల బోర్డు ఆమోదం తెలిపినప్పటికీ కార్మిక సంఘాల నుంచి నిరసన వ్యక్తవడంతో ఆర్థిక శాఖ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుని 8.8 శాతం వడ్డీ రేటును కొనసాగించాల్సి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈసారి ఇటువంటి పరిస్థితి తలెత్తకుండా నిరోధించేందుకు ఆర్థిక శాఖ నుంచి ముందుగానే అనుమతి పొందేందుకు కార్మిక శాఖ ప్రయత్నిస్తున్నట్లు అభిజ్ఞ వర్గాలు తెలిపాయి.