బిజినెస్

రూ.500 నోట్లపైనే దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: పెద్ద నోట్ల రద్దు అనంతరం ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్న కొత్త 2000, 500 రూపాయల నోట్లను సరికొత్త భద్రతా ఫీచర్లతో దేశీయంగానే డిజైన్ చేయడం జరిగిందని, కనుక వీటికి నకిలీలను ముద్రించే అవశాకాలు చాలా తక్కువని కేంద్ర ప్రభుత్వం గురువారం వెల్లడించింది. ‘దేశంలో కరెన్సీ నోట్లను డిజైన్ చేయడం ఇదే తొలిసారి అని, గతంలో 500 రూపాయల నోట్లను విదేశాల్లోనే డిజైన్ చేయడం జరిగేదని, అయితే ఇప్పుడు కొత్త 500, 2000 రూపాయలను అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్లతో పూర్తిగా స్వదేశంలోనే డిజైన్ చేయడం జరిగిందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ గురువారం న్యూఢిల్లీలో విలేఖరులకు వివరించారు. ప్రస్తుతం రిజర్వు బ్యాంకు 500 రూపాయల నోట్ల ముద్రణపై ప్రధానంగా దృష్టి సారించిందని, కనుక ప్రస్తుతం నగదు కొరత వలన తలెత్తిన సమస్యలు రెండు మూడు వారాల్లో మరింత తగ్గుతాయని ఆయన చెప్పారు.
రద్దయిన పాత 500, 1000 రూపాయల నోట్లకు బదులుగా ప్రజలకు సాధ్యమైనంత త్వరలో నగదును అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తొలుత 2000 రూపాయల నోట్ల ముద్రణకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో ఆ నోట్ల నిల్వ తగినంతగా ఉందని, దీంతో ఇప్పుడు 500 రూపాయల నోట్ల ముద్రణపై రిజర్వు బ్యాంకు దృష్టి కేంద్రీకరించిందని ఆయన అన్నారు.
నగదు ముద్రణాలయాలను సమీప ప్రాంతాలతో అనుసంధానించి నగదు పంపిణీని కూడా మరింత మెరుగుపరుస్తున్నామని, గ్రామీణ ప్రాంతాలకు మరింత నగదును అందుబాటులో ఉంచడంతో పాటు రైతులకు వ్యవసాయ రుణాలు ఇచ్చేందుకు సహకార బ్యాంకులకు తగినంత సొమ్ము ఇస్తున్నామని, జిల్లా సహకార బ్యాంకుల్లో తగినంత సొమ్ము ఉండేలా చూసేందుకు రిజర్వు బ్యాంకుతో పాటు జాతీయ గ్రామీణ వ్యవసాయ అభివృద్ధి బ్యాంకు (నాబార్డ్)తో ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని వివరించారు.
దేశ వ్యాప్తంగా ఉన్న 2.20 లక్షల ఎటిఎంలలో ప్రస్తుతం 13 శాతం ఎటిఎంలు కూడా పనిచేయడం లేదన్న ఆరోపణలో ఏమాత్రం నిజం లేదని, కొత్త నోట్ల పంపిణీకి అనుగుణంగా ఇప్పటికే 2 లక్షలకు పైగా ఎటిఎంలను రీక్యాలిబరేట్ చేయడం జరిగిందని, అయితే చాలా బ్యాంకులు ఎటిఎంలలో నగదును నింపకుండా తమ శాఖల ద్వారా సొంత ఖాతాదారులకు నగదును పంపిణీ చేస్తుండటం వల్లనే చాలా ఎటిఎంలలో ‘నో-క్యాష్’ బోర్డులు దర్శనమిస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని ఎటిఎంలలో కూడా నగదును నింపాలని బ్యాంకులకు సూచించామని, అలాగే పెద్ద నోట్ల రద్దు అనంతరం భారీ మొత్తంలో పట్టుబడిన కొత్త నోట్లను కూడా సాధ్యమైనంత త్వరలో మళ్లీ చెలామణిలోకి తీసుకురావాలని భావిస్తున్నామని, దీంతో నగదు చెలామణి మరింత పెరుగుతుందని శక్తికాంత దాస్ చెప్పారు.

చిత్రాలు..వివరాలను వెల్లడిస్తున్న కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్, కొత్తగా ముద్రిస్తున్న రూ.500 నోట్లు