బిజినెస్

మార్కెట్లపై ఫెడ్ ప్రభావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 15: అమెరికా ఫెడ్ రిజర్వ వడ్డీ రేట్లను పెంచుతూ తీసుకున్న నిర్ణయం ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. వడ్డీ రేట్లను పావు శాతం పెంచుతున్నట్లు బుధవారం ప్రకటించిన అమెరికా ఫెడ్ రిజర్వ్ వచ్చే ఏడాది మూడు సార్లు వడ్డీ రేట్లను పెంచే అవకాశముందన్న సంకేతాలను సైతం ఇవ్వడం తెలిసిందే. పావుశాతం వడ్డీ రేటు పెంపు ముందునుంచే ఊహించినదే అయినప్పటికీ వచ్చే ఏడాది వడ్డీ రేట్ల పెంపు మరింత వేగంగా జరుగుతుందంటూ ఇచ్చిన సంకేతాలే మార్కెట్లపై ఎక్కువ ప్రభావం చూపించినట్లు పరిశీలకులు అంటున్నారు. ఫెడ్ రిజర్వ్ నిర్ణయంతో డాలరుతో రూపాయి సైతం దాదాపు 42 పైసల మేర పతనమైంది. ఈ నేపథ్యంలో సెనె్సక్స్ 84 పాయింట్లు నష్టపోగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం దాదాపు 29 పాయింట్లు నష్టపోయింది. వాస్తవానికి సెనె్సక్స్ ప్రారంభంలోనే నష్టాలతో మొదలైంది. ఫెడ్ రిజర్వ్ నిర్ణయంతో అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్లనుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలిపోతాయన్న భయంతో మదుపరులు పెద్ద ఎత్తున అమ్మకాలకు దిగడంతో ఒక దశలో 26,407.58 పాయింట్ల కనిష్టస్థాయిని తాకిన సెనె్సక్స్ చివర్లో కాస్త కోలుకొని 83.77 పాయింట్ల నష్టంతో 26,519.07 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం 8225.90-8121.95 పాయింట్ల మధ్య ఊగిసలాడుతూ చివరికి 28.85 పాయింట్లు నష్టపోయి 8,153.60 పాయింట్ల వద్ద ముగిసింది. ప్రధానంగా సన్‌ఫార్మా, ఎన్‌టిపిసి, టాటా మోటార్స్, ఐటిసి, భారతీ ఎయిర్‌టెల్, సిప్లా, డాక్టర్ రెడ్డీస్, ఏసియన్ పెయింట్స్, కోల్ ఇండియా, హిందుస్థాన్ యూనిలీవర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్‌ఐఎల్)లు భారీగా నష్టపోయాయి. అయితే రూపాయితో డాలరు విలువ పెరగవచ్చన్న అంచనాలతో టిసిఎస్ షేరు వరసగా రెండోరోజు కూడా భారీగా పెరిగింది. సెనె్సక్స్‌లోని 30 కంపెనీల షేర్లలో 18 షేర్లు నష్టపోగా, 12 షేర్లు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రధాన ఆసియా మార్కెట్ల సూచీలన్నీ నష్టాలతో ముగియగా, ఐరోపా మార్కెట్లలో ప్రారంభంలో మిశ్రమ ధోరణులు కనిపించాయి.
ఇదిలా ఉండగా బిఎస్‌ఇ ప్రమోట్ చేసిన సెట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (సిడిఎస్‌ఎల్) తన తొలి పబ్లిక్ ఇష్యూకు సంబంధించిన ముసాయిదా పత్రాలను త్వరలోనే మార్కెట్ రెగ్యులేటర్ అయిన సెబికి సమర్పిస్తుందని సంస్థ వర్గాలు తెలిపాయి. ఒక వేళ అనుకున్నట్లుగా ఐపిఓ పథకం అమలయిన పక్షంలో స్టాక్ ఎక్స్‌చేంజిలో లిస్టింగ్ అయిన తొలి డిపాజిటరీ సంస్థ ఇదే అవుతుంది. ఇనె్వస్టర్లు ఒక ఖాతాను తెరవడం ద్వారా తమ సెక్యూరిటీలను సిడిఎస్‌ఎల్‌లో డిపాజిట్ చేయవచ్చు. షేర్లు, డిబెంచర్లు, బాండ్లు లాంటి ఇనె్వస్టర్లకు చెందిన సెక్యూరిటీలను ఎలక్ట్రానిక్ రూపంలో ఈ సంస్థలో డిపాజిట్ చేయవచ్చు. సిడిఎస్‌ఎల్‌లో 1.7 కోట్లకు పైగా ఇనె్వస్టర్ల ఖాతాలున్నాయి. ఐపిఓలో బిఎస్‌ఇ సహా సంస్థలోని వాటాదారులు ఆఫర్- ఫర్- సేల్ మార్గం ద్వారా తమ షేర్లను విక్రయించే అవకాశం ఉంది. సిడిఎస్‌ఎల్‌లో బిఎస్‌ఇకి 50.5 శాతం వాటా ఉంది.