బిజినెస్

ఇటిఎఫ్‌లలో ఇపిఎఫ్‌ఓ పెట్టుబడులు రూ.10,484 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఇపిఎఫ్‌ఓ) ఈ ఏడాది నవంబర్ వరకు ఇటిఎఫ్ (ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్)లో 10,484 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టిందని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం పార్లమెంట్‌కు తెలియజేసింది. సెనె్సక్స్, నిఫ్టీల్లోని టాప్-50 సూచీలను ఆధారంగా చేసుకుని ఇపిఎఫ్‌ఓ ఈ ఏడాది ఆగస్టు నుంచి ఇటిఎఫ్‌లలో పెట్టుబడులను ప్రారంభించిన విషయం తెలిసిందే. తొలుత ఇపిఎఫ్‌ఓ రాబడుల్లో (చందాదారుల డిపాజిట్లలో) 5 శాతంతో ప్రారంభమైన ఈ పెట్టుబడులను ఆ తర్వాత 10 శాతానికి పెంచడంతో నవంబర్ 30వ తేదీ వరకు ఇటిఎఫ్‌లలో ఉద్యోగ భవిష్య నిధి సంస్థ పెట్టిన మొత్తం పెట్టుబడులు 10,483.81 కోట్ల రూపాయలకు చేరాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు. ఉద్యోగ భవిష్య నిధి సొమ్మును కేవలం ఇటిఎఫ్‌లలో మాత్రమే పెట్టుబడులు పెట్టాలని ఇపిఎఫ్‌ఓ సెంట్రల్ బోర్డు ట్రస్టీలు నిర్ణయించారు. ఈ పెట్టుబడులపై గరిష్ఠ స్థాయిలో ఆదాయాన్ని పొందాలన్నదే ఇపిఎఫ్‌ఓ ప్రధాన ధ్యేయమని మేఘ్వాల్ తెలిపారు.