బిజినెస్

19 నుంచి కొరియన్ ఎక్స్‌పో-2016

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 16: మన దేశంతో ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలన్న లక్ష్యంతో కొరియా వాణిజ్య, పెట్టుబడుల అభివృద్ధి సంస్థ (కొట్రా) భారత వాణిజ్య, పారిశ్రామిక మండళ్ల సమాఖ్య (్ఫక్కీ)తో కలసి ఈ నెల 19, 20 తేదీల్లో ఇక్కడ కొరియన్ ఎక్స్‌పో-2016ను నిర్వహించనుంది. కొరియా విద్యుత్, వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఈ ప్రదర్శనను ప్రధానంగా వినియోగదారులతో పాటు వ్యాపారులను దృష్టిలో ఉంచుకుని నిర్వహిస్తున్నారు. 100కు పైగా ఎగ్జిబిటర్లకు చెందిన వెయ్యికి పైగా ఉత్పత్తులను ఈ ఎక్స్‌పోలో ప్రదర్శించనున్నారు. దేశ, విదేశాల నుంచి వేలాది మంది సందర్శకులు ఈ ఎక్స్‌పోను సందర్శిస్తారని నిర్వాహకులు భావిస్తున్నారు.