బిజినెస్

నోట్ల రద్దుతో డిజిటల్ విప్లవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: నోట్ల రద్దు భారత్‌లో భారీ మార్పును తీసుకు రానుందని, ఈ చర్య ఫలితంగా బ్యాంకుల్లో డిపాజిట్లు, డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరగనున్నాయని ఓ నివేదిక అంచనా వేసింది. 2025 నాటికల్లా నగదు రహిత రిటైల్ పేమెంట్లు ఏకంగా పది రెట్లు పెరిగే అవకాశముందని కూడా అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం డచ్ బ్యాంక్ అంచనా వేసింది. డిజిటల్ పేమెంట్ల విప్లవానికి ప్రధాన కారణం పెద్ద నోట్ల రద్దేకానుందని ఆ బ్యాంక్ అభిప్రాయ పడింది. 2025 నాటికల్లా నగదు రహిత రిటైల్ పేమెంట్లు పది రెట్లు పెరగవచ్చని, లావాదేవీలు జరపడానికి మొబైల్ ఫోన్ ఒక ప్రధాన మార్గం కానుందని ఆ నివేదిక పేర్కొంది. పరిపూర్ణం కానప్పటికీ నగదు రహిత లావాదేవీలకు మారడానికి అవసరమైన వాతావరణం భారత్‌లో ఉందని కూడా ఆ నివేదిక అభిప్రాయ పడింది. దేశ జనాభాలో 93 శాతం మంది ఆధార్‌కు అనుసంధానమై ఉండడం, డేటా వేగాలు, కనెక్టివిటీలు మెరుగుపడ్డం, వాటికి అనుగుణంగా ఉన్న నిబంధనలు ఇవన్నీ కూడా ఈ లక్ష్య సాధనకు తోడ్పడనున్నాయని ఆ నివేదిక పేర్కొంది. కార్యకలాపాల ఖర్చులు 70-80 శాతం తగ్గడం, వినియోగదారులకు అనుకూలంగా ఉండే లావాదేవీల ఆప్షన్లు అన్నీ కలిపి డిజిటల్ చెల్లింపులు పెరగడానికి దోహదపడనున్నాయని నివేదిక తెలిపింది.