బిజినెస్

మూడో రోజూ నష్టాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 16: అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వచ్చే ఏడాది మరింతగా వడ్డీ రేట్లు పెంచవచ్చన్న భయాలకు తోడు నోట్ల రద్దులాంటి పరిణామాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం వరసగా మూడో రోజు కూడా నష్టాల్లో ముగిశాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలతో ఈ నష్టాలు శుక్రవారం చాలావరకు తగ్గాయి. బిఎస్‌ఇ సెనె్సక్స్ 29.51 పాయింట్లు తగ్గగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ 14.15 పాయింట్లు తగ్గింది. అయితే ఈ వారంలో సెనె్సక్స్ 257.62 పాయింట్లు, నిఫ్టీ 122.30 పాయింట్లు నష్టపోయాయి. నెల రోజుల్లో ఒక వారంలో దేశీయ ప్రధాన సూచీలు ఇంతగా నష్టపోవడం ఇదే మొదటిసారి. ఒక దశలో 26,594.55 పాయింట్ల గరిష్ఠస్థాయిని, 26,455.21 పాయింట్ల కనిష్టస్థాయిని తాకిన సెనె్సక్స్ చివరికి 29.51 పాయింట్ల నష్టంతో 26,489.56 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే 8178.70-8,127.45 పాయింట్ల మధ్య కదలాడిన నిఫ్టీ సైతం 14.15 పాయింట్ల నష్టంతో 8,139.45 పాయింట్ల వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా యూరోతో డాలరు 14 ఏళ్ల గరిష్ఠస్థాయికి చేరడం కూడా మార్కెట్ కష్టాలకు కారణమైంది. సెనె్సక్స్‌లోని షేర్లలో భారతీ ఎయిర్‌టెల్, ఒఎన్‌జిసి షేర్లు అత్యధికంగా నష్టపోగా, అరబిందో ఫార్మా, అదానీ పోర్ట్స్, ఐసిఐసిఐ బ్యాంక్, ఐటిసి, హీరో మోటోకార్ప్, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, విప్రో, కోల్ ఇండియా, లుపిన్, బజాజ్ ఆటో, గెయిల్, ఎన్‌టిపిసి, డాక్టర్ రెడ్డీస్ షేర్లు కూడా నష్టపోయిన వాటిలో ఉన్నాయి. అయితే టాటా మోటార్స్, సిప్లా, ఇన్ఫోసిస్, టిసిఎస్‌లాంటి షేర్లు లాభపడ్డాయి. సెనె్సక్స్‌లోని 30 కంపెనీల్లో 19 కంపెనీలు నష్టపోగా, 11 కంపెనీలు లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లలో మిశ్రమ ధోరణి కనిపించగా, ఐరోపా మార్కెట్లు ప్రారంభంలోనే నష్టాలు చవిచూశాయి.