బిజినెస్

ఉత్పత్తిలో హైదరాబాద్ ఎన్‌ఎఫ్‌సి ప్రపంచ రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 9: ప్రపంచంలోనే అత్యధిక అణు ఇంధన ఉత్పత్తి కేంద్రంగా హైదరాబాద్‌లోని అణు ఇంధన సంస్థ (ఎన్‌ఎఫ్‌సి) నిలిచింది. గత 2015-16 ఆర్థిక సంవత్సరంలో అణు రియాక్టర్లలో ఉపయోగించే 1503 మెట్రిక్ టన్నుల పీడన శక్తితో కూడిన భార జలాన్ని (పిహెచ్‌డబ్ల్యుఆర్) ఉత్పత్తి చేసింది. ఈ వివరాలను అణు ఇంధన సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఒ) డాక్టర్ ఎన్ సాయిబాబా తెలిపారు.
శనివారం ఇక్కడ ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ 2014-15 సంవత్సరంలో 252 మెట్రిక్ టన్నుల పిహెచ్‌డబ్ల్యుఆర్ ఇంధన సముదాయాలను ఉత్పత్తి చేశామన్నారు. భారత ప్రభుత్వ అణు శక్తి విభాగం అనుబంధ సంస్థల్లో ఒకటైన ఈ సంస్థ అణు రియాక్టర్లకు అవసరమయ్యే ఇంధన సముదాయాలను ఉత్పత్తి చేస్తుందన్నారు.
సంస్థ పిహెచ్‌డబ్ల్యుఆర్‌లో ఉపయోగించే ప్రెజర్ ట్యూబ్స్, కాలండ్రియా ట్యూబ్స్, గార్టర్ స్ప్రింగ్స్, రియాక్టివిటీ మెకానిజం అసెంబ్లీస్ వంటి వివిధ జిర్కోనియం మిశ్రమ లోహాలతో రూపొందించే రియాక్టర్ కోర్ స్ట్రక్చరల్ , భార జలం రియాక్టర్లలలో వినియోగించే స్క్వేర్ చానల్స్‌ను ఉత్పత్తి చేస్తుందన్నారు. తమ సంస్థ తమిళనాడులోని కల్పకంలో నిర్మితమవుతున్న ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్‌కు అవసరమైన ఇతర సముదాయాలను కూడా అందచేసిందన్నారు. అణుశక్తి, అంతరిక్ష, రక్షణ విభాగాలకు సంబంధించి కీలకమైన అవసరాలను తీర్చే వివిధ రకాలను ప్రత్యేక పదార్థాలతో చేసే సీంలెస్ ట్యూబ్స్‌ను తమ సంస్థ ఉత్పత్తి చేస్తున్నట్లు చెప్పారు. వీటిలో ముఖ్యంగా ట్రస్ రాడ్ సముదాయాలు, తేలికపాటి యుద్ధ విమానాల కొరకు హైడ్రాలిక్ ట్యూబ్స్, పృథ్వి, నాగ్, బ్రహ్మోస్ వంటి అనేక రకాల మిసైళ్ల కొరకు, యుద్ధ పరికరాల కోసం, అణు జలాంతర్గామి, అత్యాధునిక ఆల్ట్రా సూపర్ క్రిటికల్ బాయిలర్లకు ఉపయోగించే ప్రత్యేక గ్రేట్ సీంలెస్ ట్యూబ్స్, కాపర్ బ్లాంక్స్ ఉన్నాయన్నారు.
హైదరాబాద్‌లోని అణు ఇంధన సంస్థ 1970లో వంద మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేశారన్నారు. ప్రస్తుతం 18 పిహెచ్‌డబ్ల్యుఆర్ రియాక్టర్లు, తారాపూర్‌లోని 2 బిడబ్ల్యుఆర్ రియాక్టర్లకు అవసరమయ్యే విధంగా 850 మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి చేరుకుందన్నారు. తమ సంస్థ 500 మెగావాట్ల ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఏర్పాటుకు అవసరమైన వివిధ సబ్ అసెంబ్లీస్‌ను సకాలంలో ఉత్పత్తి చేసిందని సిఇఒ డాక్టర్ ఎన్ సాయిబాబా తెలిపారు. వచ్చే ఆరేళ్లలో 15 వేల మెగావాట్ల అణు విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తామని పేర్కొన్నారు. దీనికి సాలీనా 3 వేల కోట్ల రూపాయలను ఖర్చుపెట్టనున్నట్లు చెప్పారు.

chitram 2015-16 ఆర్థిక సంవత్సరం ఉత్పత్తి వివరాలను తెలియజేస్తున్న ఎన్‌ఎఫ్‌సి ప్రతినిధులు