బిజినెస్

డిజిటల్ లావాదేవీల్లో ముందుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 17: డిజిటల్ కరెన్సీ లావాదేవీల నిర్వహణలో యావత్ ప్రపంచానికే ఆంధ్రప్రదేశ్ మార్గదర్శకంగా నిలుస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. ప్రపంచం అంతా ప్రస్తుతం డిజిటల్ కరెన్సీ వినియోగం దిశగా నడుస్తోందన్నారు. విశాఖ రుషికొండ ఐటి పార్క్‌లో ఫిన్‌టెక్ వ్యాలీని శనివారం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ భవిష్యత్‌లో ప్రపంచ నెంబర్ వన్‌గా ఫిన్‌టెక్ వ్యాలీ ప్రశంసలు అందుకుంటుందన్నారు. ప్రపంచంలోనే తొలిసారిగా ఆర్థిక, సాంకేతిక రంగాలను సమ్మిళితం చేసి ఫిన్‌టెక్ వ్యాలీకి రూపకల్పన చేసిన తొలి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ నుంచి జరగడం శుభ పరిణామంగా పేర్కొన్నారు. ఫిన్‌టెక్ వ్యాలీ ఏర్పాటు ద్వారా నూతన అధ్యాయానికి ఎపి శ్రీకారం చుట్టిందని, మొబైల్ కరెన్సీ వినియోగంలో ఫిన్‌టెక్ కంపెనీలు కీలకభూమిక పోషిస్తాయన్నారు. ప్రస్తుతం పేటిఎం వంటి ఐదు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నామని చంద్రబాబు తెలిపారు. ఫిన్‌టెక్ కంపెనీలకు అవసరమైన మానవ వనరులను పెంపొందించుకునేందుకు వీలుగా యూనివర్శిటీలు, కళాశాలలతో అవగాహన కుదుర్చుకున్నట్టు ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో మొబైల్, డిజిటల్ కరెన్సీ వినియోగంపై నూతన ఆవిష్కరణలు, కోర్సులు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా అద్భుత ఫలితాలు సాధిస్తామన్న నమ్మకం తనకుందని చెప్పారు. ప్రస్తుతం ఐదు కంపెనీలతో ప్రారంభమైన ఫిన్‌టెక్ వ్యాలీ.. భవిష్యత్‌లో వేల కంపెనీల భాగస్వామ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాలీగా రూపుదిద్దుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ఆర్థిక సంబంధ లావాదేవీల నిర్వహణలో భద్రత ముఖ్యమని, సైబర్ నేరాలకు ఆస్కారం లేకుండా ఖాతాదారుల నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉందన్నారు. దీనికోసం ప్రపంచ స్థాయి ఐటి దిగ్గజాల సలహాలు, సూచనలు తీసుకునేందుకు ఉన్నత స్థాయి కమిటీకి రూపకల్పన చేసినట్టు చంద్రబాబు వెల్లడించారు. సైబర్ నేరాలు, హ్యాకింగ్‌ను అరికట్టడంతోపాటు పటిష్టమైన ఐఓటి ఇంటిగ్రేటెడ్ వ్యవస్థను రూపొందించేందుకు ఫిన్‌టెక్ వ్యాలీ సానుకూల వాతావరణాన్ని కల్పిస్తుందన్నారు. విశాఖ కేంద్రంగా ఫిన్‌టెక్ వ్యాలీ ఏర్పాటు ప్రారంభం మాత్రమేనని, మరిన్ని అద్భుతాలకు మనం వేదికగా నిలుస్తామన్నారు. భారత్ డిజిటల్ దిశగా ఎదుగుతోందని, అందుకు ఎపి కేంద్రంగా నిలుస్తుందన్న విశ్వాసాన్ని కనబరి చారు. ఈ సందర్భంగా ఆయన ఫిన్‌టెక్ వ్యాలీలో పేటిఎం, బ్లాక్‌ట్రస్ట్, జిఎంఎస్ సొల్యూషన్స్, ట్రాంజాక్షన్ ఎనలిస్ట్స్, నాల్‌స్కేప్ సంస్థలను ప్రారంభించారు. అలాగే వ్యాలీలో జిఎంఎస్ గ్లోబల్, ఎఎన్‌ఎస్‌ఆర్ కనె్సల్టింగ్, బ్రాండిడ్జ్, వేల్యూల్యాబ్స్, హెచ్‌ఎస్‌బిసి సంస్థలు.. కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయన్నారు. వీటితో పాటు గీతం, గాయత్రి, బుల్లయ్య, నోబుల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అనంతలక్ష్మి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యా సంస్థలతో అవగాహన ఒప్పందాలపై ప్రభుత్వ ఐటి సలహాదారు జెఎ చౌదరి ఆధ్వర్యంలో సిఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందాలు కుదిరాయ.
మరో పారిశ్రామిక విప్లవానికి నాంది
విశాఖలో ఫిన్‌టెక్ టవర్ ప్రారంభంతో నాలుగో పారిశ్రామిక విప్లవానికి నాంది పలికినట్టైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఐటి కంపెనీల ప్రతినిధులతో సమావేశమైన ఆయన డిజిటల్ కరెన్సీ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఫిన్‌టెక్ వ్యాలీ అవసరం మరింత పెరిగిందని, దీనికి ప్రపంచ స్థాయి ఐటి దిగ్గజాలు సహకరించాలని కోరారు. ఎటువంటి పొరబాట్లకు తావు లేకుండా వ్యవస్థను సజావుగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ప్రాంక్లిన్ టెంప్లీటస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చైర్మన్ అలోక్ సేథీ, బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజింగ్ డైరెక్టర్ పిఎస్ జయకుమార్, కాగ్నిజంట్ ఐటి సర్వీసెస్ సెంటర్ ప్రతినిధి సుబిర్ మెహ్రా, బ్రాండిడ్జ్ కంపెనీ ఎండి వి లక్ష్మీకాంత్, సౌత్ ఏసియా వీసా ఐటి సర్వీసెస్ సీనియర్ డైరెక్టర్ సునాలీ రొహ్రా తదితరులు సిఎంతో చర్చలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మంత్రులు, ఎంపిలు తదితరులు పాల్గొన్నారు. కాగా, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుతో కలిసి వుడా చిల్డ్రన్స్ థియేటర్‌నూ చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.

చిత్రాలు...ఫిన్‌టెక్ వ్యాలీని ప్రారంభిస్తున్న సిఎం చంద్రబాబు నాయుడు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుతో కలిసి వుడా చిల్డ్రన్స్ థియేటర్‌ను ఆవిష్కరిస్తున్న చంద్రబాబు