బిజినెస్

దేశ, విదేశీ పరిణామాలపై ఆధారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా, పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాలూ మదుపరుల పెట్టుబడులను శాసించనున్నాయని మార్కెట్ విశే్లషకులు అంటున్నారు.
బ్యాంకుల్లో పెద్ద ఎత్తున పాత నోట్లు డిపాజిట్ అవుతున్నప్పటికీ, వాటి స్థానంలో కొత్త నోట్ల మార్పిడి వేగంగా జరగకపోవడం, ముఖ్యంగా 100 రూపాయల నోట్ల చెలామణి తగ్గి వ్యాపారాలు స్తంభించిపోవడం మదుపరులనూ కలవరపెడుతోంది. దీంతో ద్రవ్యవ్యవస్థలోకి పెరిగే కొత్త నోట్లతోనే మార్కెట్లు లేవడమా? పడిపోవడమా? అనేది తెలుస్తుందని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ విధానాలూ మదుపరుల పెట్టుబడులపై ప్రభావం చూపనున్నాయ.
ట్రంప్ అమెరికా అధ్యక్షుడైతే ఆ దేశానికేగాక, ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని మెజారిటీ మదుపరులు ఎన్నికల సమయంలో పెట్టుబడులను లాగేసుకున్నది తెలిసిందే. ఫలితంగా భారత్‌సహా అన్ని ప్రధాన దేశాల మార్కెట్లు నష్టాల్లో కూరుకుపోయాయ. అయతే ట్రంప్ గెలవడం, ఆ తర్వాత ఆయన చేసిన ప్రసంగం మదుపరులను ఆకట్టుకోవడంతో పరిస్థితి కొంత మెరుగైంది. కానీ ప్రస్తుత ట్రంప్ విధానాలు మళ్లీ భయాందోళనలకు దారితీస్తు న్నాయ. అంతేగాక ఆయన ఎన్నికపై రగులుతున్న వివాదాలూ ప్రాధాన్యతను సంతరించు కుంటున్నాయ. మరోవైపు ఎప్పట్లాగే డాలర్‌తో పోల్చితే రూపాయ మారకం విలువ, విదేశీ మదుపరుల పెట్టుబడులు, గ్లోబల్ స్టాక్ మార్కెట్ల కదలికలు భారతీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్‌ను ప్రభావితం చేయనున్నాయ. ముఖ్యంగా రూపాయ మారకం విలువ అన్నింటికంటే అధికంగా దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
రూపాయ విలువ గత కొద్దిరోజులుగా తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నది తెలిసిందే. దీంతో మరింతగా క్షీణిస్తే ఆ ప్రభావం స్టాక్ మార్కెట్లపై కచ్ఛితంగా కనిపిస్తుంది. ఫలితంగా మదుపరులు ఫారెక్స్ ట్రేడింగ్‌పైనా దృష్టి సారిస్తారని మెజారిటీ నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశీయ బహుళ వ్యాపార దిగ్గజం టాటా గ్రూప్‌లో నెలకొన్న టాటా-మిస్ర్తిల సంక్షోభం కూడా మార్కెట్లపై ప్రభావం చూపుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
కాగా, గత వారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 258 పాయింట్లు నష్టపోయంది. ఇక నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ కూడా గత వారం ట్రేడింగ్‌లో 122 పాయింట్లు పడిపోయంది. నవంబర్ 18 నుంచి గమనిస్తే సూచీలు ఈ స్థాయలో క్షీణించడం ఇదే తొలిసారి. నాడు సెనె్సక్స్ 667 పాయంట్లు, నిఫ్టీ 222 పాయంట్లు కోల్పోయాయ.