బిజినెస్

నోట్ల రద్దుపై 22న పార్లమెంట్ కమిటీకి ఉర్జిత్ వివరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: పాత పెద్ద నోట్ల రద్దుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్.. పార్లమెంట్ కమిటీకి వివరణ ఇవ్వనున్నారు. నోట్ల రద్దు ప్రక్రియ, దాని ప్రభావం గురించి ఈ నెల 22న ఉర్జిత్ పటేల్ ఆర్థిక వ్యవహారాలపై పార్లమెంట్ కమిటీకి వివరిస్తారు. ఈ మేరకు పార్లమెంట్ వెబ్‌సైట్‌లో ఆదివారం వివరాలను పొందుపరిచారు. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలన కోసం గత నెల 8వ తేదీ రాత్రి పాత 500, 1,000 రూపాయల నోట్ల చలామణిని ప్రధాన మంత్రి మోదీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించినది తెలిసిందే. అయితే ఆ రోజు నుంచి ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, డిజిటల్ పేమెంట్స్ కోసం ప్రకటించిన ప్రోత్సాహకాలను పటేల్.. పార్లమెంట్ ప్యానెల్‌కు గురువారం తెలియజేస్తారు.