బిజినెస్

‘ఉద్యోగుల అవినీతి కలచివేసింది’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో చోటుచేసుకున్న అవినీతిలో తమ బ్యాంక్ ఉద్యోగులు ఉండటంపట్ల యాక్సిస్ బ్యాంక్ ఎండి, సిఇఒ శిఖా శర్మ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థ పరువును మంటగలిపారన్న ఆమె జరిగినదానిపై కెపిఎమ్‌జితో ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేయిస్తున్నామని చెప్పారు. అంతేగాక మున్ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లకు రాసిన ఓ లేఖలో శిఖా శర్మ పైవిధంగా స్పందించారు. తమ బ్యాంక్ కార్యకలాపాలను విశ్వసించవచ్చని, నిజాయితీతో సేవలు అందిస్తున్నామని, అయితే కొందరు నగదు మార్పిడిలో చేతివాటాన్ని ప్రదర్శించడం దురదృష్టకరమని అన్నారు.