బిజినెస్

మరోసారి వేలానికి కింగ్‌ఫిషర్ హౌస్, విల్లా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 18: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రుణాల నేపథ్యంలో దాని ప్రమోటర్ విజయ్ మాల్యాకి చెందిన కింగ్‌ఫిషర్ హౌస్, కింగ్‌ఫిషర్ విల్లాల అమ్మకానికి మరోసారి బ్యాంకులు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు ముంబయిలోని కింగ్‌ఫిషర్ హౌస్‌తోపాటు, గోవాలోని కింగ్‌ఫిషర్ విల్లాలను వేలం వేసిన బ్యాంకర్లకు నిరాశే మిగిలింది. దీంతో ధరలను తగ్గించి మళ్లీ వీటిని వేలానికి తెస్తున్నాయి బ్యాంకులు. ఈ వారంలో వీటిని వేలానికి పెట్టనున్నాయి. సోమవారం కింగ్‌ఫిషర్ హౌస్‌ను, గురువారం కింగ్‌ఫిషర్ విల్లాను వేలం వేస్తున్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ నేతృత్వంలోని 17 బ్యాంకుల కూటమికి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ 9,000 కోట్ల రూపాయలకుపైగా బకాయిపడినది తెలిసిందే. ఈ నేపథ్యంలో మాల్యా దేశం విడిచి పారిపోగా, ఆయన్ను ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుగా కూడా పలు బ్యాంకులు ప్రకటించాయి. ఈ వ్యవహారం కోర్టుల్లోకి కూడా చేరగా, బకాయిల వసూళ్లలో భాగంగా మాల్యా స్థిర, చరాస్తుల అమ్మకానికి బ్యాంకులు దిగుతున్నాయి. మాల్యా ఇండ్లు, కార్లు, వ్యక్తిగత విమానం ఇలా అన్నింటినీ బ్యాంకులు, ఆదాయ, వాణిజ్య, సేవా పన్ను శాఖలు వేలం వేస్తున్నప్పటికీ కొనేవారే కరువయ్యారు. కాగా, ఈసారి కింగ్‌ఫిషర్ హౌస్ ధరను 115 కోట్ల రూపాయలుగా, కింగ్‌ఫిషర్ విల్లా ధరను 81 కోట్ల రూపాయలుగా బ్యాంకర్లు నిర్ణయించాయి. ఈసారితో పోల్చితే క్రిందటిసారి కింగ్‌ఫిషర్ హౌస్ ధర 15 శాతం అధికంగా ఉంది. అలాగే విల్లా ధర 5 శాతం ఎక్కువ.