బిజినెస్

అనుమానిత ఖాతాల లావాదేవీలను నిలిపివేసిన యాక్సిస్ బ్యాంక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 19: దేశీయ ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ సంస్థ యాక్సిస్ బ్యాంక్.. కొన్ని అనుమానిత ఖాతాల లావాదేవీలను నిలిపివేసింది. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో బ్యాంక్ ఉద్యోగులు కొందరు అక్రమాలకు పాల్పడిన నేపథ్యంలో యాజమాన్యం అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే అవినీతికి తావులేకుండా మునుపెన్నడూ లేని చర్యలు చేపడుతోంది. తాత్కాలికంగా కొన్ని అనుమానిత ఖాతాల లావాదేవీలను నిలిపివేసినట్లు బ్యాంక్ ఓ ప్రకటనలో సోమవారం తెలిపింది. కాగా, పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో చోటుచేసుకున్న అవినీతిలో తమ బ్యాంక్ ఉద్యోగులు ఉండటంపట్ల యాక్సిస్ బ్యాంక్ ఎండి, సిఇఒ శిఖా శర్మ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థ పరువును మంటగలిపారన్న ఆమె జరిగినదానిపై కెపిఎమ్‌జితో ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేయిస్తున్నామని చెప్పారు. అంతేగాక మున్ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లకు రాసిన ఓ లేఖలో శిఖా శర్మ పైవిధంగా స్పందించారు. తమ బ్యాంక్ కార్యకలాపాలను విశ్వసించవచ్చని, నిజాయితీతో సేవలు అందిస్తున్నామని, అయితే కొందరు నగదు మార్పిడిలో చేతివాటాన్ని ప్రదర్శించడం దురదృష్టకరమన్నారు.