బిజినెస్

రూ. 2 కోట్ల టర్నోవర్‌దాకా పన్ను చెల్లించనక్కర్లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 19: నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం ఓ అద్భుత అవకాశమిచ్చింది. బ్యాంకింగ్, డిజిటల్ పేమెంట్లకు అంగీకరిస్తే 2 కోట్ల రూపాయల టర్నోవర్ వరకు పన్ను మినహాయింపునిస్తామని సోమవారం కేంద్రం స్పష్టం చేసింది. మరోవైపు రద్దయిన పాత 500, 1,000 రూపాయల నోట్లను ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన (పిఎమ్‌జికెవై) క్రింద పన్ను చెల్లింపులకు వినియోగించుకోవచ్చని మోదీ సర్కారు చెప్పింది. ఈ నెల 30 వరకు ఈ అవకాశం ఉంటుందని పేర్కొంది. ఇదిలావుంటే వచ్చే నెలా నగదు కొరత ఉంటుందని, సాధారణ పరిస్థితులు ఫిబ్రవరికల్లా రావచ్చని ఎస్‌బిఐ రిసెర్చ్ నివేదిక ఒకటి అంచనా వేసింది. ఫిబ్రవరి ఆఖరు నాటికి రద్దయిన నోట్లలో 78-88 శాతం చలామణిలోకి రావచ్చంది. ఇకపోతే డిజిటల్ ఎకానమీకి ఊతమిచ్చేలా ప్రతి నెలా గ్రామీణ ప్రాంత వినియోగదారులకు కనీసం 100 మెగాబైట్ల డేటాను ఉచితంగా ఇవ్వాలని, అందుకు ప్రభుత్వ సాయం అవసరమని టెలికామ్ రెగ్యులేటర్ ట్రాయ్ సిఫార్సు చేసింది. దీనివల్ల మొబైల్ ద్వారా ఉచిత చెల్లింపులకు ఆస్కారముంటుందని పేర్కొంది.