బిజినెస్

ఖాయలా పరిశ్రమలను పునరుద్ధరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 19: తెలంగాణ రాష్ట్రంలో మూతబడిన పరిశ్రమలను (సిక్ యూనిట్లు) తిరిగి పునరుద్ధరించేందుకు చేయూతనిస్తామని, ఇందుకోసం త్వరలోనే ప్రత్యేక విధానాన్ని (పాలసీ) ప్రకటిస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె తారకరామారావు స్పష్టం చేశారు. టిఎస్-ఐపాస్, సులభతర సరళీకృత వ్యాపార విధానం (ఇఓడిబి)పై శాసన మండలిలో సోమవారం జరిగిన స్వల్ప వ్యవధి చర్చకు మంత్రి సమాధానం ఇస్తూ ఖాయలా పరిశ్రమలపై ఒక సర్వే చేశామన్నారు. ఇండస్ట్రీ హెల్త్ క్లినిక్ పేరుతో వీటిని ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వీలైనంత త్వరలో తుది విధానాన్ని ప్రకటిస్తామని తెలిపారు.
కాగా, 2017 నవంబర్‌లో గ్లోబల్ ఇనె్వస్ట్‌మెంట్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని కెటిఆర్ చెప్పారు. గ్లోబల్ సమ్మిట్ నిర్వహించేందుకు చాలా ముందునుండే ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని, ఇందుకోసం బృహత్ ప్రణాళిక అవసరం ఉంటుందన్నారు. అందుకే ఇప్పటి నుండే ఏర్పాట్లు ప్రారంభించామని వివరించారు. ప్రభుత్వం రూపొందించే విధానంలో అందరి భాగస్వామ్యం ఉండాలన్నదే ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఉద్దేశమని కెటిఆర్ పేర్కొన్నారు. టిఎస్-ఐపాస్ (తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక ప్రాజెక్ట్ ఆమోదం, స్వయం ధృవీకరణ వ్యవస్థ) రూపొందించే సమయంలో కూడా ఈ రంగానికి చెందిన నిపుణులందరితో సవివరంగా చర్చినట్టు గుర్తు చేశారు. అందుకే టిఎస్-ఐపాస్ దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా అందరినీ ఆకర్షించిందన్నారు. పెట్టుబడిదారులకు పారిశ్రామిక అనుమతులను పొందేందుకు చట్టబద్దమైన హక్కును కల్పించడంతో జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఖ్యాతి లభించిందని వివరించారు. పరిశ్రమల ఏర్పాటు కోసం వచ్చిన దరఖాస్తులను నిర్ణీత గడువులోగా డిస్పోస్ చేయకపోతే సంబంధిత అధికారికి రోజూ వెయ్యిరూపాయల చొప్పున జరిమానా విధిస్తున్నామన్నారు. ఆన్‌లైన్ విధానాన్ని ఎంపిక చేయడం వల్ల దరఖాస్తుదారులు ఎవరూ అధికారులను వ్యక్తిగతంగా కలవాల్సిన అవసరం లేదన్నారు.
రాష్ట్రంలో ఇంతవరకు 2,929 పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చామని మంత్రి తెలిపారు. వీటిపై 49,463 కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారన్నారు. ఈ పరిశ్రమల వల్ల 1,95,390 మందికి ప్రత్యక్షంగా, మరో 3 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. అనుమతించిన పరిశ్రమల్లో 1,138 పరిశ్రమలు ఇప్పటికే వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించాయని, మరో 405 కంపెనీలు నిర్మాణం పూర్తయ్యే దశలో ఉన్నాయని వివరించారు.
సుహృద్భావ వ్యాపార వాతావరణం కల్పించేందుకు వ్యవస్థాగత సంస్కరణలు తీసుకువచ్చామని కెటిఆర్ తెలిపారు. ఇప్పటివరకు ఒక పరిశ్రమను ఐదేళ్లకాలంలో ఆరు కార్మిక చట్టాల కింద 30 సార్లు తనిఖీ చేయాల్సి వచ్చేదని గుర్తుచేశారు. తాజాగా ప్రవేశపెట్టిన సంయుక్త తనిఖీ విధానం ద్వారా ఒక పరిశ్రమను ఐదేళ్ల కాలంలో ఒకేసారి తనిఖీ చేయాల్సి ఉంటుందన్నారు. కార్మిక శాఖలో 57 రిజిస్టర్లలో పొందుపరిచే సమాచారాన్ని కేవలం రెండు రిజిస్టర్లకు ఏకీకృతం చేశామన్నారు. 14 రిటర్న్స్‌లలో సమర్పించాల్సిన సమాచారాన్ని ఒకే ఒక్క రిటర్న్‌లో సమర్పించే అవకాశం కల్పించామని వివరించారు. భవన నిర్మాణ అనుమతుల కోసం ఇప్పటివరకు నెలల తరబడి సమయం పట్టేదని, ఇప్పుడు 14 రోజుల్లో అనుమతిస్తున్నామన్నారు. కాలుష్య నియంత్రణ మండలి (పియుసి) జారీ చేసే లైసెన్స్ కాలపరిమితిని ఏడాది నుండి ఐదేళ్ల వరకు పొడిగించామన్నారు. అలాగే ఫ్యాక్టరీస్ లైసెన్స్ కాలపరిమితిని సంవత్సరం నుండి 10 సంవత్సరాలకు పెంచామన్నారు. ఇఓడిబి అంశంలో కేంద్రం చేసిన మూల్యాంకనంలో తెలంగాణ ప్రథమస్థానంలో నిలిచిందని మంత్రి తెలిపారు.
హైదరాబాద్‌లోనే ఆపిల్ కంపెనీ
ఆపిల్ సంస్థని హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేస్తున్నారని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఈ కంపెనీ బెంగళూరు తరలిపోయిందంటూ ప్రతిపక్ష నాయకుడు చేసిన ప్రకటనలో వాస్తవం లేదన్నారు. పరిశ్రమల ఏర్పాటులో తెలంగాణ వారికి ప్రాధాన్యత ఇస్తున్నామని, హైదరాబాద్‌తోపాటు ఇతర జిల్లాల్లో కూడా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామన్నారు. గత ప్రభుత్వం బ్రాహ్మణి సెజ్‌తో పాటు ఇతర సంస్థలకు కేటాయించిన 724 ఎకరాలను ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారని తెలియగానే ఈ భూమిని స్వాధీనం చేసుకున్నామని కెటిఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. హైదరాబాద్ లో గతంలో ఏర్పాటైన కంపెనీల్లో కాలు ష్యం వెదజల్లే పరిశ్రమలను దూరప్రాంతాలకు తరలిస్తున్నామని వివరించారు.