బిజినెస్

ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి రూ. 4 లక్షలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 19: ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన కొత్త బడ్జెట్‌లో ఆదాయ వర్గాలకు మరింత ఊరట కలిగించే అవకాశం కనిపిస్తోంది. ఆదాయ వర్గాలు, మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం కలిగించే రీతిలో వచ్చే ఆర్థిక సంవత్సరం (2017-18) బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి జైట్లీ ప్రతిపాదించవచ్చుననే కథనాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతమున్న ఆదాయ పన్ను గరిష్ఠ పరిమితిని 2.50 లక్షల రూపాయల నుంచి 4 లక్షల రూపాయల వరకు పెంచే వీలున్నట్లు తెలుస్తోంది. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో తలెత్తిన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మొత్తం ఆదాయ పన్ను వ్యవస్థకే కాయకల్ప చికిత్స చేసేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ సన్నద్ధమవుతున్నట్లుగా చెబుతున్నారు. ఆదాయ పన్ను గరిష్ఠ పరిమితిని 4 లక్షల రూపాయలకు పెంచడం వల్ల ప్రజలకు అనేక రకాలుగా ప్రయోజనం కలుగుతుందని, నగదు లభ్యత కూడా ఇనుమడిస్తుందని ఈ వర్గాలు వెల్లడించాయి. పెద్ద నోట్ల రద్దు వల్ల కలిగిన బాధను తట్టుకుని ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన నిజాయితీగల పన్ను చెల్లింపుదారులకు ఆర్థికపరమైన ఊరటను అందించాలన్న విస్తృత వ్యూహంలో భాగంగానే పన్ను పరిమితిని 4 లక్షల రూపాయలకు పెంచే యోచనను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ప్రజల చేతిలో ఖర్చు పెట్టుకునేందుకు, అదేవిధంగా పొదుపు చేసేందుకు ఎక్కువ పరిమాణంలో నగదును అందుబాటులోకి తెచ్చేలా పన్నుల వ్యవస్థను పునర్‌వ్యవస్థీకరించనున్నట్లుగా అభిజ్ఞ వర్గాల కథనం. దేశంలో ఎంతగా నగదు వినియోగం పెరిగితే, పొదుపూ పెంపొందితే అంతగా ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా నగదుపరమైన సంక్షోభ పరిస్థితులు తలెత్తినప్పుడు దాన్నుంచి బయటపడాలంటే ప్రజల చేతిలో పన్ను మినహాయింపుల ద్వారా ఖర్చు చేసుకోగలిగే నగదను అందుబాటులోకి తేవడమే సరైన మార్గమని విశే్లషిస్తున్నారు. ఎంతగా ఆదాయం అందుబాటులో ఉంటే నిత్యవసర వస్తువులపైనే కాకుండా, ఇతర కొనుగోళ్లపైనా వినియోగదారులు దృష్టి పెట్టే అవసరం ఉంటుందన్నది ఈ ఆలోచన సారాంశం. ప్రస్తుతం మూడు దశల్లో ఆదాయ పన్ను విధిస్తున్నారు. 2.50 లక్షల రూపాయల లోపు ఆదాయమున్నవారికి ఏ రకమైన పన్నూ లేదు. దీన్ని మించి 5 లక్షల రూపాయల లోపు వార్షిక ఆదాయం కలిగిన వారికి 10 శాతం పన్ను, 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల మధ్య ఆదాయం ఉన్నవారికి 20 శాతం పన్ను, 10 లక్షల రూపాయలకుపైగా ఆదాయమున్నవారికి 30 శాతం పన్ను విధిస్తున్నారు. ప్రస్తుతం అమలవుతున్న పన్ను శ్లాబులు, రేట్లను ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజా పరిణామాల నేపథ్యంలో లోతుగా పరిశీలిస్తోంది. ఈ పన్నులకు అదనంగా కోటి రూపాయలకుపైన ఆదాయం పన్ను విధించేందుకు వీలున్న ఆదాయం కలిగిన వారికి అదనపు సర్‌చార్జీగా 12 శాతం మొత్తాన్ని విధిస్తున్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో కోటి రూపాయలకుపైగా ఆదాయమున్నట్లుగా ప్రకటించిన వారి సంఖ్య కేవలం 48 వేలే. కాగా, యేటా 10 కోట్లకు మించిన ఆదాయమున్న వారిపై సూపర్ రిచ్ ట్యాక్స్‌ను విధించే అవకాశం కూడా కనిపిస్తోంది. పెద్ద నోట్ల రద్దు కారణంగా దాదాపుగా దేశంలో కొనుగోళ్లు తగ్గిపోయాయి. మారిన వ్యవస్థకు అనుగుణంగా మారే విషయంలో ప్రజలు తంటాలు పడుతున్నారు. ఇప్పటివరకు గణనీయమైన వృద్ధిరేటును సాధించిందంటే అందుకు ప్రధాన కారణం ఖర్చేనన్నది ఎంతైనా వాస్తవం. అంటే భిన్న వినియోగ వస్తువులపై ప్రజలు ఎంతగా ఖర్చు పెడతారో, అంతగానూ ఉత్పాదకతకు, ఉత్పత్తులకు ఊతం లభిస్తుంది. అంతిమంగా అది ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తుంది. ప్రస్తుతం జిడిపిలో సగానికిపైగా ఈ రకమైన వినియోగ వస్తువుల ఖర్చు కారణంగానే సాధ్యమైందన్నది తాజా లెక్కల సారాంశం. అంతేగాక భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించడానికి ఈ రకమైన వినియోగ ఖర్చు ఎంతగానో దోహదం చేసింది.