బిజినెస్

స్టాక్ మార్కెట్లను వెంటాడిన పెద్ద నోట్ల రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 22: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 262.78 పాయింట్లు పతనమై 25,979.60 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 82.20 పాయింట్లు క్షీణించి 8 వేల స్థాయికి దిగువన 7,979.10 వద్ద నిలిచింది. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో పడిపోయిన వ్యాపారంతో వ్యాపార, పారిశ్రామిక సంస్థల లాభం ఈ అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో తగ్గుతుందన్న అంచనాలు మదుపరులను అమ్మకాల ఒత్తిడికి గురిచేశాయి. దీనికితోడు అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లూ నష్టపోవడంతో దేశీయ సూచీలు వరుసగా ఏడోరోజూ నష్టాలకే పరిమితమయ్యాయి. ఆసియా మార్కెట్లలో చైనా సూచీ లాభపడినప్పటికీ, జపాన్, హాంకాంగ్ సూచీలు నష్టపోయాయి. ఐరోపా మార్కెట్లలోనూ బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ సూచీలు క్షీణించాయి. ఇక భారతీయ స్టాక్ మార్కెట్ల విషయానికొస్తే గురువారం జరిగిన ట్రేడింగ్‌లో మెటల్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, విద్యుత్ రంగాల షేర్లు నష్టాలకు లోనయ్యాయి.