బిజినెస్

బ్యాంకులకు తప్పని భంగపాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 22: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రుణాల నేపథ్యంలో బకాయల వసూళ్లకుగాను దాని ప్రమోటర్ విజయ్ మాల్యాకి చెందిన ఆస్తుల అమ్మకానికి బ్యాంకులు చేస్తున్న చర్యలు విజయవంతం అయ్యేలా కనిపించడం లేదు. మరోసారి బ్యాంకులు చేసిన ప్రయత్నం విఫలమైంది మరి. గురువారం గోవాలోని కింగ్‌ఫిషర్ విల్లా వేలానికి స్పందన కరువైంది.
ధరను తగ్గించినా ఆశించిన ఫలితం దక్కలేదు. రియల్ ఎస్టేట్ రంగంలో నెలకొన్న మందగమనం మధ్య విల్లా ధరను బ్యాంకులు మరింతగా తగ్గించవ చ్చన్న అంచనాల కారణంగా తాజా వేలంలో ఎవరూ పాల్గొనలేదు. కాగా, సోమవారం నిర్వహించిన కింగ్‌ఫిషర్ హౌస్ వేలంలోనూ బ్యాంకులు భంగపాటుకు గురైనది తెలిసిందే. 17 వేల చదరపు అడుగులకుపైగా విస్తీర్ణంలో నిర్మించిన కింగ్‌ఫిషర్ హౌస్‌ను కొనేందుకు ఒక్కరూ రాలేదు. ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ నేతృత్వంలోని 17 బ్యాంకుల కూటమికి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ 9,000 కోట్ల రూపాయలకుపైగా బకాయిపడినది తెలిసిందే. ఈ నేపథ్యంలో మాల్యా దేశం విడిచి పారిపోగా, ఆయన్ను ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుగా కూడా పలు బ్యాంకులు ప్రకటించాయి. ఈ వ్యవహారం కోర్టుల్లోకీ చేరగా, బకాయిల వసూళ్లలో భాగంగా మాల్యా స్థిర, చరాస్తుల అమ్మకానికి బ్యాంకులు దిగుతున్నాయి. అయతే మాల్యా ఇండ్లు, కార్లు, వ్యక్తిగత విమానం ఇలా అన్నింటినీ బ్యాంకులు, ఆదాయ, వాణిజ్య, సేవా పన్ను శాఖలు వేలం వేస్తున్నప్పటికీ కొనేవారే కరువయ్యారు. కాగా, ఈసారి కింగ్‌ఫిషర్ హౌస్ ధరను 115 కోట్ల రూపాయలుగా, విల్లా ధరను 81 కోట్ల రూపాయలుగా బ్యాంకర్లు నిర్ణయించారు. ఈసారితో పోల్చితే క్రిందటిసారి కింగ్‌ఫిషర్ హౌస్ ధర 15 శాతం అధికం. అలాగే విల్లా ధర 5 శాతం ఎక్కువ.