బిజినెస్

నాసిరకం సరకులు సరఫరా చేస్తే బ్లాక్‌లిస్టే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 22: గుంటూరుతోపాటు ఇతర జిల్లాల్లో ఒకటి రెండుచోట్ల పంపిణీ అయిన నాసిరకం చంద్రన్న కానుకల స్థానంలో నాణ్యమైన సరకులు పంపిణీ చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత రేషన్ షాపు డీలర్లను, అధికారులను ఆదేశించారు. ఒకటి, రెండుచోట్ల నాసిరకం సరకులు పంపిణీ చేయటంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా గుంటూరు జిల్లా తెనాలిలో బెల్లం నాసిరకంగా ఉందని, వెంటనే వెనక్కి తీసుకుని నాణ్యమైన బెల్లం సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. సరఫరాదారులపై విచారణ జరిపించి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పేదలు పండుగ రోజు అన్నిరకాల వంటకాలతో భోజనం చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న ఈ సరకుల నాణ్యతలో రాజీపడేది లేదని మంత్రి తెలిపారు. నాణ్యమైన సరకులు సరఫరా చేయని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని మంత్రి హెచ్చరించారు. కార్డుదారులు కూడా సరకులు తీసుకునేటప్పుడు పరిశీలించుకుని, నాసిరకంగా అనిపించిన వాటిని వెనక్కు ఇచ్చి నాణ్యమైనవి తీసుకోవాలని మంత్రి సునీత సూచించారు.