బిజినెస్

3జి కస్టమర్లకూ జియో సేవలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: టెలికామ్ రంగంలో సంచలనాలకు మారు పేరైన రిలయన్స్ జియో.. ఇక 3జి స్మార్ట్ఫోన్ల వినియోగదారులకూ తమ సేవలను అందించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 4జి స్మార్ట్ఫోన్ల వినియోగదారులకు ఉచిత కాల్స్, డేటా సౌకర్యాన్ని కల్పించిన ఈ ముకేశ్ అంబానీ నేతృత్వంలోని జియో ఇన్ఫోకామ్.. ప్రత్యర్థి సంస్థలకు గుబులు పుట్టిస్తున్నది తెలిసిందే. 5 కోట్లకుపైగా వినియోగదారులతో దూసుకెళ్తున్న జియో.. 3జి స్మార్ట్ఫోన్లకూ సేవలను అందిస్తే వినియోగదారుల సంఖ్య మరింత పెరుగుతుందనడంలో సందేహమే లేదు. ఇదిలావుంటే కొత్త సంవత్సరం కానుకగా జనవరి 1 నుంచి 3జి కస్టమర్లకు జియో సేవలు అందుబాటులోకి వస్తాయని సమాచారం. దీని కోసం ఓ యాప్‌ను కూడా రూపొందిస్తోంది జియో.