బిజినెస్

మరిన్ని ఎస్సార్ ఆయిల్ పెట్రోల్ పంపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: దేశీయ అతిపెద్ద ప్రైవేట్‌రంగ చమురు మార్కెటింగ్ సంస్థ ఎస్సార్ ఆయిల్.. వ్యాపార విస్తరణపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే రాబోయే 18 నెలల్లో పెట్రోల్ బంకుల సంఖ్యను రెట్టింపు చేయనుంది. ఇప్పుడున్న 2,800 పెట్రోల్ పంపులకు మరో 2,800 పెట్రోల్ పంపులను తీసుకురావాలని చూస్తోంది. ఈ మేరకు సంస్థ చైర్మన్ ప్రశాంత్ రుయా తెలిపారు. చమురు ధరలపై నియంత్రణాధికారాన్ని కేంద్రం.. వదులుకోవడంతో ప్రైవేట్‌రంగ సంస్థలూ తిరిగి పెట్రోల్, డీజిల్ వ్యాపారంలో బలాన్ని పెంచుకుంటున్నాయి. కాగా, గుజరాత్‌లో 20 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యం కలిగిన చమురు రిఫైనరీ ఎస్సార్ ఆయిల్‌కు ఉంది. దీన్ని 1,200 కోట్ల రూపాయలతో ఆధునీకరించనుంది.