బిజినెస్

రూ. 3,300 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో దేశవ్యాప్తంగా భారీ ఎత్తున నల్లధనం వెలుగుచూస్తున్నది తెలిసిందే. నోట్ల రద్దు తర్వాత నిత్యం ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేస్తునే ఉండగా, ఆ దాడుల్లో రద్దయిన పాత నోట్లతోపాటు కొత్త నోట్లూ బయటపడుతున్నాయి. అయితే ఈ దాడుల్లో ఇప్పటిదాకా పట్టుబడిన నల్లధనం విలువ ఎంతో తెలుసా? అక్షరాలా 3,300 కోట్ల రూపాయలు. అవును.. నిజం. ఇదంతా కేవలం గత నలభై రోజుల్లోనే దొరకడం గమనార్హం. ఇక ఈ సొమ్ములో బంగారం ఆభరణాల విలువ దాదాపు 2,900 కోట్ల రూపాయలుగా ఉంది. మిగతా 400 కోట్ల రూపాయలకుపైగా నగదులో 90 కోట్ల రూపాయలకుపైగా కొత్త నోట్లే. ఇక దేశవ్యాప్తంగా బుధవారం నాటికి 734 దాడులు నిర్వహించినట్లు ఆదాయ పన్ను శాఖ వర్గాలు తెలిపాయి. పన్ను ఎగవేతలు, హవాలా వ్యాపారం కేసుల్లో 3,200 మందికి నోటీసులు ఇచ్చినట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలన కోసం గత నెల కేంద్రం పాత పెద్ద నోట్ల చలామణిని రద్దు చేసినది తెలిసిందే. నవంబర్ 8వ తేదీ రాత్రి పాత 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. కొత్తగా 500, 2,000 రూపాయల నోట్లనూ పరిచయం చేస్తున్నట్లు తెలిపారు. అయతే కేంద్రం తీసుకున్న సంచలన నిర్ణయంతో అవాక్కయన అక్రమార్కులు.. తమ సంపదను కాపాడుకునే పనిలోపడ్డారు. కనిపించిన అడ్డదారులన్నింటినీ వాడుకుని అవినీతి సొమ్మును రక్షించుకోవాలని చూశారు. దీంతో అప్రమత్తమైన సర్కారు.. ఆదాయ పన్ను శాఖ (ఐటి)తోపాటు, కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి)లను రంగంలోకి దించింది. ఫలితంగా నివ్వెరపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయ. అంతే స్థాయలో నల్లధనం కూడ కంటబడుతోంది.