బిజినెస్

విద్యుత్ కేంద్రాలకు సింగరేణి బొగ్గు అందిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, డిసెంబర్ 23: తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న విద్యుత్ కేంద్రాలకు బొగ్గును అందించాల్సిన బాధ్యత సింగరేణి సంస్థపై ఉందని సింగరేణి కాలరీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ్ధర్ అన్నారు. శుక్రవారం ‘సింగరేణి డే’ సందర్భంగా ఇక్కడి ప్రకాశం స్టేడియంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. సింగరేణి సంస్థ ఉత్పాదనలతో పాటు సంక్షేమ కార్యక్రమాల అమలుకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ఈ ఏడాది సంస్థ విద్యుదుత్పత్తి రంగంలోకి అడుగుపెట్టిందని, 12 వందల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించుకున్నామన్నారు. దక్షిణ భారతదేశంలో సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తోందని ఆయన చెప్పారు. బంగారు తెలంగాణ ఏర్పాటులో సింగరేణీయులంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సభలో సింగరేణి డైరెక్టర్ (పా) పవిత్రన్ కుమార్, ప్రాజెక్ట్ ప్లానింగ్ డైరెక్టర్ మనోహర్‌రావు, ఇఅండ్‌ఎం డైరెక్టర్ రమేష్‌బాబు, సీజిఎంలు, జిఎంలు పాల్గొన్నారు.