బిజినెస్

విశాఖలో బయోటెక్ సెంటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 23: విశాఖ కేంద్రంగా గీతం విశ్వవిద్యాలయంలో బయెటెక్ సెంటర్ ఏర్పాటు కానుంది. సుమారు 2.5 మిలియన్ డాలర్ల ఖర్చుతో బయోటెక్ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ సెంటర్‌ను ప్రఖ్యాత స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ సహకారంతో గీతం యూనివర్శిటీ ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించి గీతం యూనివర్శిటీ చైర్మన్ ఎంవివిఎస్ మూర్తి సమక్షంలో స్టాన్‌ఫోర్డ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ రేడియేషన్ అంకాలజీ విభాగం ప్రొఫెసర్ సంజయ్ మల్‌హోత్రాతో గీతం వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎంఎస్ ప్రసాదరావు ఒప్పందాలపై శుక్రవారం సంతకాలు చేశారు. ఈ సందర్భంగా గీతం విద్యా సంస్థల చైర్మన్ ఎంవివిఎస్ మూర్తి మాట్లాడుతూ రాష్ట్రాన్ని బయోటెక్ హబ్‌గా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ సంకల్పానికి ఊతమిస్తూ జీవశాస్త్రాలు, బయోటెక్నాలజీ రంగంలో అధునాతన పరిశోధనలకు గీతం యూనివర్శిటీ వేదిక కానుందన్నారు. గీతంలో ఏర్పాటు చేసే బయోటెక్నాలజీ సెంటర్‌కు స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ నిపుణులు, మేధావులు సహకారాన్ని అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడం మైలురాయిగా పేర్కొన్నారు. ఇప్పటికే బయోటెక్నాలజీ రంగంలో గీతం పరిశోధకులు దేశం గర్వించతగ్గ రీతిలో అధ్యయనాలు జరుపుతున్నారని వివరించారు. పలు పరిశోధన ప్రాజెక్టుల ఫలితాలు పేటెంట్‌లు పొందే దశలో ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని బయోటెక్ హబ్‌గా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ ప్రణాళికలకు స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీతో కలిసి గీతం యూనివర్శిటీ పరిశోధనలకు కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో గీతం ప్రో వైస్‌ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ శివరామకృష్ణ, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అభివృద్ధి సంస్థ కనె్సల్టెంట్ అబ్దుల్ రెహ్మాన్ ఇలియాస్, బయోటెక్నాలజీ టాస్క్ఫోర్స్ కమిటీ కో చైర్మన్ ఎం శ్రీనివాస శంకర్ ప్రసాద్, భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ బయోటెక్నాలజీ విభాగం మాజీ సలహాదారు డాక్టర్ టిఎస్ రావు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటున్న
గీతం విశ్వవిద్యాలయ ప్రతినిధులు