బిజినెస్

ఎట్టకేలకు కోలుకున్న స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 23: దేశీయ స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు లాభాలను అందుకున్నాయి. వరుసగా ఏడు రోజులు నష్టాలను చవిచూసిన సూచీలు.. శుక్రవారం కోలుకున్నాయి. ఔషధ, ఆటో, క్యాపిటల్ గూడ్స్ రంగాల షేర్లు మదుపరులను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 61.10 పాయింట్లు పెరిగి 26,040.70 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 6.65 పాయింట్లు అందుకుని 7,985.75 వద్ద నిలిచింది.
నిజానికి ఉదయం సూచీలు నష్టాలతోనే మొదలయ్యాయి. సెనె్సక్స్ 64 పాయింట్లు, నిఫ్టీ 24 పాయింట్ల చొప్పున క్షీణించాయి. అయితే మదుపరులు పెట్టుబడులకు ఆసక్తి కనబరచడంతో తిరిగి సూచీలు పుంజుకున్నాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 17 పైసలు ఎగిసి 67.82 స్థాయికి చేరడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచిందని నిపుణులు విశే్లషిస్తున్నారు. కాగా, క్యాపిటల్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆటో, చమురు, గ్యాస్ రంగాల షేర్ల విలువ 0.87 శాతం నుంచి 0.26 శాతం వరకు పెరిగింది. రియల్టీ, హెల్త్‌కేర్, ఎఫ్‌ఎమ్‌సిజి, ఐటి రంగాల షేర్ల విలువ 1.06 శాతం తగ్గినప్పటికీ సూచీలు లాభాలను అందుకోగలిగాయి.
అయితే బిఎస్‌ఇ స్మాల్-క్యాప్ 0.04 శాతం, మిడ్-క్యాప్ 0.40 శాతం పడిపోయాయి. ఇక అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో ప్రధాన సూచీలైన హాంకాంగ్, చైనా సూచీలు నష్టపోయాయి. జపాన్ మార్కెట్లకు సెలవు. మరోవైపు ఐరోపా మార్కెట్లలో కీలక సూచీలైన జర్మనీ, ఫ్రాన్స్ సూచీలు లాభపడ్డాయి.
బ్రిటన్ సూచీ మాత్రం నష్టపోయింది. ఇదిలావుంటే ఈ వారం మొత్తంగా దేశీయ మార్కెట్ల విషయానికొస్తే సెనె్సక్స్ 448.86 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ కూడా 153.70 పాయింట్లు క్షీణించింది.