బిజినెస్

ఆఫ్రికా దేశాలకు శాంత బయోటెక్నిక్స్ వాక్సిన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరరాబాద్, డిసెంబర్ 23: పేద దేశాలకు తక్కువ ధరతో అందించడానికి తయారు చేసిన వాక్సిన్లు తెలంగాణ నుంచి ఎగుమతి కావడం రాష్ట్రానికి గర్వకారణమని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అన్నారు. శాంతా బయోటెక్నిక్స్ తయారు చేసిన శాంతా ఫైన్ వాక్సిన్ మొదటి ఎగుమతి ప్యాక్‌ను ప్రగతి భవన్ నుంచి శుక్రవారం ముఖ్యమంత్రి తన చేతుల మీదుగా ఆఫ్రికా దేశాలకు పంపించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రపంచంలోని పలు బహుళ జాతి సంస్థలు అందించే వాక్సిన్ల కంటే తక్కువ ధరకు శాంతా బయెటిక్నిక్స్ వాక్సిన్లను తయారు చేసిందని ప్రశంసించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్ సంస్థలు కూడా శాంతా బయోటెక్నిక్స్ ఉత్పత్తులను గుర్తించిందన్నారు. గతంలో అనేకానేక ప్రాణోపయోగకరమైన వ్యాక్సిన్లను ప్రపంచానికి అందించిన సంస్థ శాంతా బయోటెక్నిక్స్ సంస్థ. ప్రస్తుతం ఐదు రకాల వ్యాధులను అరికట్టే రోగ నిరోధక మందును సంస్థ అందిస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో శాంతా బయోటెక్నిక్స్ చైర్మన్ వరప్రసాద్‌రెడ్డి, సంస్థ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

చిత్రం..శాంతా ఫైన్ వాక్సిన్‌ను ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్