బిజినెస్

స్పెక్ట్రమ్ కేటాయింపులపై సేవా పన్ను వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 23: స్పెక్ట్రమ్ కేటాయింపులపై సేవా పన్నును తొలగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సెల్యులార్ ఆపరేటర్ల సంఘం సిఒఎఐ కోరింది. టెలికామ్ సేవలను అందించడానికి అయ్యే ఖర్చు పెరిగినందున సేవా పన్నును వేయరాదంది. సేవా పన్ను వల్ల వ్యయభారం మరింత పెరుగుతుందని, ఇది వినియోగదారులకు లాభదాయకం కాబోదని తమ బడ్జెట్ సిఫార్సుల్లో ప్రభుత్వానికి సిఒఎఐ విన్నవించింది. స్పెక్ట్రమ్ కేటాయింపులు, వన్-టైమ్ స్పెక్ట్రమ్ పేమెంట్ అనేవాటిని సర్వీస్ ట్యాక్స్ పరిధిలోకి తేవద్దంది.