బిజినెస్

‘వ్యాట్‌కు..జిఎస్‌టికి పెద్దగా తేడాలేదు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 24: విలువ ఆధారిత పన్ను (వ్యాట్)కు, వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)కు మధ్య పెద్దగా తేడా లేదని ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ టాక్స్ ప్రాక్టీషనర్స్ అధ్యక్షుడు డాక్టర్ ఎంవికె మూర్తి అన్నారు. హైదరాబాద్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గతంలో సెంట్రల్ ఎక్సైజ్, సెంట్రల్ సేల్స్ టాక్స్, వ్యాట్‌తోపాటు రాష్ట్ర పరిధిలో అనేక పన్నులు ఉండేవన్నారు. వీటన్నింటినీ జిఎస్‌టి పరిధిలోకి తీసుకువచ్చారన్నారు. ఒకే దేశం ఒకే పన్ను విధానం అమల్లోకి వస్తోందన్నారు. జిఎస్‌టిలో కూడా క్లాసిఫికేషన్స్ ఉండబోతున్నాయని, జిఎస్‌టి విధానంలో నాలుగు రకాల టాక్స్‌లు అమల్లోకి రానున్నాయన్నారు. పెట్రోలియం ఉత్పత్తులు జిఎస్‌టి పరిధిలోకి రావడం లేదని, ఆయా రాష్ట్రాలు వారి సొంత పన్నుల విధానంలోనే వీటిని వసూలు చేసుకుంటారని మూర్తి తెలిపారు. గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్‌పై స్థానికంగ అధికపన్ను భారం పడే అవకాశం ఉందని, దాంతో వివిధ వస్తువుల ధరలపై ఈ ప్రభావం కనిపిస్తుందని అభిప్రాయపడ్డారు. 2017 సెప్టెంబర్ 10 నుండి జిఎస్‌టి అమల్లోకి వస్తుందన్నారు. ఈ సమావేశంలో ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు ఎస్ సత్యనారాయణ, సెక్రటరీ జనరల్ ఎం శ్రీనివాసరావు, దక్షిణ రాష్ట్రాల విభాగం చ్మైన్ వి నాగేంద్రప్రసాద్, కార్యదర్శి డి అమర్‌నాథ్, కోశాధికారి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.