బిజినెస్

కౌన్ బనేగా కరోడ్‌పతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 24: కానుకలందించే క్రిస్మస్ తాతగా ఈ క్రిస్మస్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అవతరించారు. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో డిజిటల్ చెల్లింపులను మోదీ సర్కారు ప్రోత్సహిస్తున్నది తెలిసిందే. ఈ క్రమంలోనే డిజిటల్ పేమెంట్లకు ఊతమిస్తూ వినియోగదారులు, వ్యాపారుల కోసం రెండు సరికొత్త పథకాలను ఈ క్రిస్మస్ రోజునే ప్రారంభిస్తోంది కేంద్రం. లక్కీ గ్రాహక్ యోజన, డిజి-్ధన్ వ్యాపారి యోజన పథకాలను ఆదివారం ప్రభుత్వం పరిచయం చేస్తోంది.
కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రవిశంకర్ ప్రసాద్‌ల చేతులమీదుగా మొదలయ్యే ఈ పథకాలు 100 రోజులు అమల్లో ఉంటాయి. ఈ వ్యవధిలో డిజిటల్ పేమెంట్స్ చేసే వినియోగదారులకు, వాటిని అనుమతించే వ్యాపారులకు నగదు బహుమతులు అందనున్నాయి. లక్కీ గ్రాహక్ యోజన కింద ఈ 100 రోజుల్లో రోజుకు 15 వేల మంది వినియోగదారులను లక్కీ డ్రాల ద్వారా ఎంపికచేసి ఒక్కొక్కరికి 1,000 రూపాయలను అందిస్తారు.
అలాగే వారానికోసారి జరిగే డ్రాలో ఏడుగురు విజేతలకు గరిష్ఠంగా లక్ష రూపాయలను అందించనున్నారు. ఇక డిజి-్ధన్ వ్యాపారి యోజన పథకం కింద వారానికి 7వేల మంది వ్యాపారులకు బహుమతులు అందుతాయి. గరిష్ఠంగా ఒక్కొక్కరు 50,000 రూపాయల వరకు పొందే వీలుంది. ఇవేగాక మెగా బహుమతుల కింద కోటి రూపాయలు, 50 లక్షల రూపాయలు, 25 లక్షల రూపాయల బహుమతులూ ఉన్నాయి. పాత పెద్ద నోట్ల రద్దు అయిన నవంబర్ 8 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 13 మధ్య డిజిటల్ లావాదేవీలు జరిపిన వినియోగదారుల నుంచి విజేతలను ఎంపిక చేస్తారు. వారికే ఏప్రిల్ 14న ఈ మెగా బహుమతులు అందుతాయి. వ్యాపారులకూ 50 లక్షల రూపాయలు, 25 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయల మెగా బహుమతులను ఇవ్వనున్నారు. కాగా, 50 రూపాయల నుంచి 3,000 రూపాయల మధ్య జరిగిన డిజిటల్ పేమెంట్లకే ఈ పథకాలు వర్తిస్తాయి.
ఈ రెండు పథకాల కోసం 340 కోట్ల రూపాయలను కేంద్రం వెచ్చిస్తోంది. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం పాత పెద్ద నోట్లను రద్దు చేసినది తెలిసిందే. గత నెల నవంబర్ 8వ తేదీ రాత్రి 500, 1,000 రూపాయల నోట్ల చలామణిని నిలిపివేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. వీటి స్థానంలో కొత్త 500, 2,000 రూపాయల నోట్లను పరిచయం చేస్తున్నట్లు తెలపగా, రద్దయిన నోట్లను ఈ నెల 30 వరకు బ్యాంకులు, పోస్ట్ఫాసుల్లో డిపాజిట్ చేసుకుని, వాటికి సమాన విలువైన కొత్త నోట్లను పొందవచ్చనీ చెప్పారు.
అయితే డిమాండ్‌కు తగ్గ కొత్త నోట్లు చలామణిలోకి రాకపోవడం, 2 వేల రూపాయల నోట్లు మాత్రమే లభించడంతో చిల్లర సమస్యలు తలెత్తాయి. నగదు లావాదేవీలు నిలిచి వ్యాపారం స్తంభించిపోయింది. దీంతో డిజిటల్ పేమెంట్ల వైపు నడవాలంటూ కేంద్ర ప్రభుత్వం ప్రచారం మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే తాజా ఈ రెండు పథకాలను ప్రారంభించింది.