బిజినెస్

బజాజ్ ఆటోపై ఫోక్స్‌వాగన్ మండిపాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: జర్మనీకి చెందిన ఆటోరంగ దిగ్గజం ఫోక్స్‌వాగన్.. శనివారం బజాజ్ ఆటోపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ పోలో కారు భద్రతా ప్రమాణాల గురించి తప్పుడు సమాచారాన్ని బజాజ్ ఆటో అందిస్తోందంటూ మండిపడింది. గురువారం బజాజ్ ఆటో ‘ఇటీవలి యూరో ఎన్‌సిఎపి నివేదికలో బజాజ్ క్యూట్ వన్ స్టార్ రేటింగ్ అందుకుంది. ఫోక్స్‌వాగన్ పోలో, ఫోర్డ్ ఫిగో, హ్యుందాయ్ ఐ10, మారుతి ఆల్టో, టాటా నానో కార్లు జీరో రేటింగ్‌ను పొందాయి.’ అని తెలిపింది.

దక్షిణాఫ్రికాలో గుప్తా సంస్థకు చిక్కులు
జోహెనె్నస్‌బర్గ్, ఏప్రిల్ 9: దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమాతో ఉన్న సత్సంబంధాలతో ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలపై తీవ్ర గందరగోళానికి గురవుతున్న భారత సంతతి వ్యాపార కుటుంబం గుప్తా బ్రదర్స్ అక్కడ తమ సంస్థను మూసేయాలనే నిర్ణయానికి వచ్చారు. అజయ్, అతుల్, రాజేశ్ గుప్తాలు తమకు మంత్రి పదవులను ఆఫర్ చేశారని ప్రస్తుత ఆర్థిక శాఖ సహాయ మంత్రి ఆరోపించారు. అయితే దాన్ని గుప్తాలు ఖండిస్తున్నారు. మరోవైపు ఈ గందరగోళం మధ్య జుమా కుమారుడు కూడా గుప్తా సంస్థల్లో డైరెక్టర్ పదవి నుంచి తప్పుకున్నాడు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలన్న డిమాండ్లు ఇప్పుడు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.