బిజినెస్

రూ. లక్ష కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 24: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం పలు కీలక వౌలికరంగ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఇందులో దేశంలోనే అతి పొడవైన సముద్ర వంతెనతోపాటు, నగరంలోని రెండు మెట్రో లైన్లూ ఉన్నాయి. ఈ మొత్తం ప్రాజెక్టుల విలువ 1.06 లక్షల కోట్ల రూపాయల పైమాటే. ఒకేరోజు ఒకే నగరానికి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉందని, ముంబయి నగర చరిత్రలో దీన్ని ఓ మైలురాయిగా పేర్కొన్నారు మోదీ. సబర్బన్ బాంద్రా-కుర్లాలోని ఎమ్‌ఎమ్‌ఆర్‌డిఎ మైదానం వద్ద జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల అమలు ఇప్పటికే ఆలస్యమైందన్నారు. వౌలిక రంగం ప్రగతి పథంలో నడిస్తేనే దేశాభివృద్ధి సాధ్యమన్న మోదీ.. తమ ప్రభుత్వం వౌలిక రంగాభివృద్ధికి పెద్దపీట వేస్తోందని చెప్పారు. పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని మదుపరులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అన్నివిధాలా సహకరిస్తుందని హామీనిచ్చారు.

చిత్రం..మెట్రో ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తున్న మోదీ