బిజినెస్

అరచేతిలో వైకుంఠం.. టిఎస్-ఐపాస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 26: నూతన పారిశ్రామిక విధానం (టిఎస్-ఐపాస్) ప్రపంచంలోనే అత్యుత్తమమైందని ప్రభుత్వం గొప్పగా చెప్పు కుంటున్నప్పటికీ ఆచరణలో అంత గొప్పది కాదని, దీనివల్ల రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదని శాసనసభలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది.
టిఎస్-ఐపాస్ ద్వారా కొత్త పరిశ్రమలకు 15 రోజులలో అన్ని అనుమతులను ఇస్తామని చెప్పినప్పటికీ దరఖాస్తు చేసిన అనేక కంపెనీలు అనుమతుల కోసం ప్రభుత్వం చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. శాసనసభలో సోమవారం టిఎస్-ఐపాస్‌పై జరిగిన లఘు చర్చ సందర్భంగా కాంగ్రెస్ సభ్యుడు సంపత్‌కుమార్ మాట్లాడుతూ పెట్టుబడులను ఆకర్షించడానికని, కొత్త పారిశ్రామిక విధానంపై పారిశ్రామికవేత్తలకు వివరించడానికని ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులతో సహా ప్రత్యేక విమానాలలో విదేశాలకు వెళ్లి కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు.
అక్కడి నుంచి ఒక్క కంపెనీ కూడా రాష్ట్రానికి రాలేదని దుయ్యబట్టారు. కొత్త పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించడానికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు విద్యుత్ చార్జీలలో రాయితీలు, రిజిస్ట్రేషన్ చార్జీలలో వెసులుబాటు, ఎస్సీ, ఎస్టీలకు మార్జిన్ మనీ సమకూర్చనున్నట్టు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటీ నెరవేరడం లేదని ఆయన అన్నారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో కేంద్ర రక్షణ శాఖ కోసం కేటాయించిన స్థలానికి రాష్ట్ర ప్రభుత్వం 48 లక్షల రూపాయలు వసూలు చేసిందని, దేశ రక్షణ శాఖకు ఉచితంగా ఇవ్వాల్సిందిపోయి డబ్బులు ఎలా తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. మొబైల్స్ తయారీ సంస్థ మైక్రోమాక్స్‌కు అదే పారిశ్రామికవాడలో రక్షణ శాఖ కంటే చౌకగా భూమి ఎలా కేటాయించారో సమాధానం చెప్పాలని సంపత్‌కుమార్ డిమాండ్ చేశారు.
టిఎస్-ఐపాస్‌లో స్థానికులకు ఉద్యోగ, ఉపాధి కల్పనపై ప్రస్తావననే లేదని ఆయన విమర్శించారు. ఐటిఐఆర్ ప్రాజెక్టు హైదరాబాద్‌లో నెలకొల్పాలని 2013లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ, ఆ ప్రాజెక్టు ఏమైందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. టిఎస్- ఐపాస్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మ కంగా తీసుకొచ్చినది తెలిసిందే.
అయతే దాని అమలు ఆ స్థాయలో లేదని శాసన సభలో ప్రతిపక్షాలు మండిపడటం ప్రాధాన్య తను సంతరించుకుంది. టిఎస్-ఐపాస్ విధానంతో రాష్ట్రంలో పరిశ్రమల విషయంలో పారదర్శకమైన నిర్ణయాలు తీసుకుంటున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అయతే టిఎస్- ఐపాస్ అమలును సర్కారు సవ్యంగా చేయడం లేదని, ఫలితంగా రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి పడకేసిందని సభలో కాంగ్రెస్ విమర్శించింది.
మొత్తానికి సోమవారం జరిగిన శాసన సభ సమావేశాల్లో ప్రతిష్ఠాత్మక టిఎస్-ఐపాస్ విధానంపై, దాని అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో లోపాలను ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ప్రధానంగానే ఎత్తిచూపింది.