బిజినెస్

మాల్యాపై ఇడి చర్యలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాపై చర్యలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వరంగ బ్యాంకైన ఐడిబిఐ బ్యాంక్‌కు 900 కోట్ల రూపాయలకుపైగా రుణాల ఎగవేతకు పాల్పడిన కేసులో విజయ్ మాల్యా వరుసగా మూడోసారి ఇడి సమన్లను బేఖాతరు చేసినది తెలిసిందే. ఈ నేపథ్యంలో మాల్యాపై తగిన చర్యలు తీసుకునే దిశగా ఇడి వెళ్తున్నట్లు సమాచారం. ఐడిబిఐ కేసులో మాల్యాపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదుచేసి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు జరుపుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో ఇప్పటికే రెండుసార్లు ఇడి విచారణకు హాజరవడంలో విఫలమైన మాల్యా.. తాజాగా శనివారం మరోసారి ముఖం చాటేశాడు. ఇడి ఎదుట హాజరయ్యేందుకు మే నెల వరకు గడువు ఇవ్వాలని కోరాడు.