బిజినెస్

11 నెలల కనిష్టానికి బంగారం ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 26: బంగారం ధరలు సోమవారం 11 నెలల కనిష్టానికి పడిపోయాయి. బులియన్ మార్కెట్‌లో 10 గ్రాములు 99.9 స్వచ్ఛత కలిగిన పసిడి ధర 250 రూపాయలు తగ్గింది. దీంతో 27,550 రూపాయలుగా నమోదైంది. ఈ ఏడాది ఫిబ్రవరి 4న ధర 27,575 రూపాయలుగా ఉండగా, ఆ స్థాయికి మళ్లీ ధర చేరింది. ఇక 99.5 స్వచ్ఛత కలిగిన పుత్తడి ధర కూడా 250 రూపాయలు తగ్గి 27,400 రూపాయలు పలికింది. ఆభరణాల వర్తకుల నుంచి డిమాండ్ లేకపోవడంతో మార్కెట్‌లో పుత్తడి ధరలు తగ్గాయని బులియన్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఫ్యూచర్ మార్కెట్ ట్రేడింగ్‌లో ధర తక్కువ పలకడం కూడా బంగారం రేటును బలహీనపరిచాయని అంటున్నాయి. మరోవైపు వెండి ధరలు కూడా క్షీణించాయి. కిలో వెండి ధర 210 రూపాయలు దిగజారి 38,600 రూపాయలకు చేరింది. పరిశ్రమలు, నాణేల తయారీదారుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడమే కారణం. కాగా, పాత పెద్ద నోట్ల రద్దు కూడా బులియన్ మార్కెట్‌ను కుంగదీసింది. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలన కోసం పాత 500, 1,000 రూపాయల నోట్ల చలామణిని గత నెల నవంబర్ 8వ తేదీ రాత్రి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించినది తెలిసిందే. ఈ క్రమంలో రద్దయిన నోట్లతో అక్రమార్కులు పెద్ద ఎత్తున బంగారం కొనుగోళ్లు జరుపుతున్నారన్న సమాచారంతో పసిడి కొనుగోళ్లపై కేంద్రం దృష్టి సారించడం, బంగారం వర్తకుల దుకాణాలపై దాడులు నిర్వహించడం, చివరకు బులియన్ మార్కెట్ లావాదేవీలు తాత్కాలికంగా మూతపడటం వంటివి మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయని వ్యాపారులు చెబుతున్నారు. అలాగే రద్దయిన నోట్ల స్థానంలో కొత్తగా తెచ్చిన 500, 2000 రూపాయల నోట్లు డిమాండ్‌కు తగ్గట్లుగా చలామణిలోకి రాకపోవడం కూడా అమ్మకాలను ప్రభావితం చేసిందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

చిత్రం..కస్టమర్లు లేక వెలవెలబోతున్న బంగారం, వెండి దుకాణం