బిజినెస్

‘అందరికీ ఆమోదయోగ్యంగా పన్నులుండాలి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫరీదాబాద్, డిసెంబర్ 26: అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే పన్నుల విధానం భారత్‌కు అవసరమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలంటే ఇది తప్పనిసరి అని ఆయన అభిప్రాయపడ్డారు. సోమవారం ఇక్కడ ఇండియన్ రెవిన్యూ సర్వీసెస్ (ఐఆర్‌ఎస్) అధికారుల ప్రొఫెషనల్ ట్రైనింగ్‌ను జైట్లీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పన్నుల విధానం అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉంటేనే సత్ఫలితాలు సాధ్యమన్నారు. పన్నులు తక్కువగా ఉండటం వల్ల అందరూ చెల్లించడానికి ముందుకు వస్తారని చెప్పారు.