బిజినెస్

పన్ను భయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 26: దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం భారీగా నష్టపోయాయి. షేర్లలో పెట్టిన పెట్టుబడుల నుంచి వచ్చే లాభాలపై ధీర్ఘకాలిక మూలధన రాబడి పన్ను విధించేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందన్న అంచనాలు మదుపరుల కొనుగోళ్ల శక్తిని దెబ్బతీశాయి.
ఉదయం ఆరంభం నుంచే మదుపరులు అమ్మకాల ఒత్తిడికి గురవగా, ట్రేడింగ్ ముగిసేదాకా ఆ ఒత్తిడిలోనే ఉన్నారు. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 233.60 పాయింట్లు పతనమై ఒక నెల కనిష్టాన్ని తాకుతూ 26వేల స్థాయికి దిగువన 25,807.10 వద్ద ముగిసింది.
నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 77.50 పాయింట్లు క్షీణించి 7 నెలల కనిష్టానికి దిగజారి 7,908.25 వద్ద నిలిచింది. శనివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ న్యాయంగా, సమర్థవంతంగా, పారదర్శకంగా స్టాక్ మార్కెట్ మదుపరులు జాతి నిర్మాణానికి చేయూతనివ్వాలని అన్నారు.
విశ్వసనీయమైన విధానాలు, సంస్కరణలు మరిన్ని తెస్తామని హామీనిచ్చారు. ఈ క్రమంలోనే పన్నుల పోటు తప్పదన్న సంకేతాలు మార్కెట్ వ్యాప్తంగా విస్తరించాయి. నిజానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆదివారం దీనిపై స్పందిస్తూ అలాంటి భయాలేమీ అక్కర్లేదని చెప్పారు.
అయినప్పటికీ మదుపరులు విశ్వసించకపోవడంతో సూచీలు నష్టపోక తప్పలేదు. అలాగే గురువారంతో ఈ నెలకుగాను డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగుస్తుండటం కూడా మదుపరులను పెట్టుబడులకు దూరం చేసింది. లాభాల స్వీకరణ దిశగా నడిచేలా చేసింది. మరోవైపు క్రిస్మస్, నూతన సంవత్సర సంబరాల్లో విదేశీ మదుపరులుండటం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. విదేశీ పెట్టుబడులు సన్నగిల్లాయి. రియల్టీ, మెటల్, హెల్త్‌కేర్, పిఎస్‌యు, విద్యుత్ రంగాల షేర్లు నష్టపోయాయి.
ఇక అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో జపాన్ సూచీ నష్టపోతే, చైనా సూచీ లాభపడింది. జపాన్ సూచీ 0.16 శాతం పడిపోతే, చైనా సూచీ 0.40 శాతం పెరిగింది. హాంకాంగ్, సింగపూర్, మలేషియా మార్కెట్లకు సెలవు. ఐరోపా మార్కెట్లలో బ్రిటన్, ఫ్రాన్స్ సూచీలు లాభపడగా, జర్మనీ సూచీ నష్టపోయింది.