బిజినెస్

ఐసిఐసిఐ బ్యాంక్ ‘ఈజీపే’ మొబైల్ యాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 27: దేశీయ ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసిఐసిఐ.. వ్యాపారుల కోసం మంగళవారం ‘ఈజీపే’ అనే ఓ యాప్‌ను పరిచయం చేసింది. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో డిజిటల్ లావాదేవీలకు ఊతమిచ్చేలా ఈ యాప్‌ను ఐసిఐసిఐ బ్యాంక్ తీసుకొచ్చింది. దీని సాయంతో వివిధ డిజిటల్ వేదికల నుంచి మొబైల్స్‌పై చెల్లింపులను వ్యాపారులు, రిటైలర్లు, ప్రొఫెషనల్స్ తీసుకొచ్చని బ్యాంక్ ఓ ప్రకటనలో తెలిపింది. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్‌కు చెందిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ ఆధారంగా ‘ఈజీపే’ను రూపొందించామని వివరించింది. క్రెడిట్/డెబిట్ కార్డుల ద్వారా, ఆన్‌లైన్ బ్యాంకింగ్‌తోనైనా లేదా ఐసిఐసిఐ బ్యాంక్ డిజిటల్ వాలెట్ ‘పాకెట్స్’ గుండానైనా ఐసిఐసిఐ బ్యాంక్ ఖాతాదారులు ఈ యాప్ ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చు. తమ బ్యాంక్‌కు చెందిన ఏ ఖాతాదారుడైనా ‘ఈజీపే’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, దాన్ని వెంటనే వినియోగించుకోవచ్చని చెప్పింది.