బిజినెస్

పాత పెద్ద నోట్ల రద్దుతో జోరుగా ఎం-వాలెట్ లావాదేవీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 27: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నగదు రహిత ఆర్థిక లావాదేవీల విలువ మున్ముందు మరింత పెరుగుతుందని, ముఖ్యంగా 2022 నాటికి మొబైల్ ద్వారా చెల్లింపులు 57 శాతం పుంజు కుంటాయని అసోచామ్, ఆర్‌ఎ న్‌సిఒఎస్ సంయుక్తంగా ఎం-వాలెట్ కార్యకలాపాలపై నిర్వహించిన సర్వే చెబుతోంది. మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అసోచామ్ సెక్రటరీ జనరల్ డిస్ రావత్, అసోచామ్ నేషనల్ కౌన్సిల్ ఆన్ సైబర్ అండ్ నెట్‌వర్క్ సెక్యూరిటీ చైర్మన్ బాబూలాల్ జైన్ మాట్లాడుతూ పాత పెద్ద నోట్ల రద్దు తర్వాత ఎం-వాలెట్ కార్యకలాపాలు పుంజుకున్నాయన్నారు. ప్రస్తుతం దేశంలో ఎం-వాలెట్ కార్యకలాపాలు 20 శాతం పెరిగాయని, 2022 నాటికి 57 శాతం విస్తరిస్తాయన్నారు. కాగా, 2013లో పది బిలియన్ రూపాయలుగా ఉన్న ఎం-వాలెట్ లావాదేవీలు.. 2016కు 206 బిలియన్ రూపాయలకు చేరుకున్నాయని చెప్పారు. ఎం-వాలెట్ మార్కెట్ శరవేగంగా విస్తరిస్తోందని, పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఈ మార్కెట్ సైజు 200లకుపైగా శాతం పెరిగి 2022 నాటికి 275 ట్రిలియన్ రూపాయలకు చేరుకోవచ్చన్నారు. కాగా, మొబైల్ వాలెట్ రంగాన్ని సమర్థవంతంగా, సైబర్ నేరాలకు ఆస్కారం లేకుండా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. కాబట్టి నిబంధనల్లో స్పష్టత ఉండాలని, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ఎం-వాలెట్ కంపెనీల నిర్వహణకు మార్గదర్శకాలు విడుదల చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలన్నారు. అప్పుడే డిజిటల్ లావాదేవీలకు ఊతమిచ్చినట్లవుతుందన్నారు.

చిత్రం..విలేఖరులతో మాట్లాడుతున్న అసోచామ్ ప్రతినిధి