బిజినెస్

రాయ్.. అలా కోరలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: జైలుకు వెళ్ళడానికి కొద్ది వారాల ముందు సహారా గ్రూప్ అధినేత సుబ్రతా రాయ్ విదేశాలకు వెళ్ళాలని సుప్రీం కోర్టును కోరారనడాన్ని సహారా సోమవారం ఖండించింది. నిజానికి కోర్టు సమన్లతో విదేశాల నుంచి రాయ్ భారత్‌కు తిరిగి వచ్చేశారని, ఆ తర్వాత దేశం విడిచి వెళ్ళలేదని, కోర్టు అనుమతి ఉన్నా ఆ ప్రయత్నం చేయలేదని చెప్పింది. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ న్యాయవాది అర్వింద్ దతర్ ఆదివారం మాట్లాడుతూ బిల్ క్లింటన్, టోని బ్లెయిర్‌లతో వ్యాపారపరమైన చర్చలు జరపాల్సి ఉందంటూ జైలుకు వెళ్ళడానికి కొద్ది వారాల ముందు విదేశాలకు వెళ్ళాలని సుప్రీంను రాయ్ కోరారన్నది తెలిసిందే. అయతే ఇదంతా నిజం కాదని సహారా తరఫు న్యాయవాది గౌతమ్ అవాస్తి కొట్టిపారేశారు. కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. మరోవైపు దీనిపై దతార్ సైతం స్పందిస్తూ తాను కేసును తప్పుదోవ పట్టించడం లేదన్నారు. మార్కెట్ నిబంధనలను ఉల్లంఘించి సహారా గ్రూప్‌నకు చెందిన రెండు సంస్థలు వేల కోట్ల రూపాయలను ప్రజల నుంచి సేకరించాయన్న వ్యవహారంలో సహారా-సెబీ సుప్రీం కోర్టులో పోరాడుతున్నది తెలిసిందే. ఈ కేసులో 2014 మా ర్చి 4 నుంచి తీహార్ జైళ్లో రాయ్ ఉంటున్నారు.