బిజినెస్

పనె్నగ్గొట్టి కారెక్కేస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: పన్నులు చెల్లించేవారు తక్కువే అయినా.. కార్లు కొనేవారి సంఖ్య మాత్రం దేశంలో ఎక్కువే. 125 కోట్లకుపైగా జనాభా ఉంటే అందులో 10 లక్షల వార్షిక ఆదాయం ఉన్నవారు కేవలం 24.4 లక్షల మంది. కానీ యేటా 25 లక్షల కొత్త కార్ల విక్రయాలు జరుగుతున్నాయని ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి చెప్పారు. ఇందులో 35 వేలు లగ్జరీ కార్లే కావడం గమనార్హం. 2014-15 మదింపు సంవత్సరంలో తమ ట్యాక్స్ రిటర్న్స్‌ను దాఖలు చేసినవారు 3.65 కోట్ల మంది. ఇందులో 5 లక్షల రూపాయలకు మించి పన్ను చెల్లించినవారు కేవలం 5.5 లక్షల మంది అని సదరు అధికారి తెలిపారు. మొత్తం వసూలైన పన్నుల్లో వీరు చెల్లించినది 57 శాతంతో సమానం. అయితే గడచిన ఐదేళ్లుగా చూస్తే దేశంలో కార్ల అమ్మకాలు యేటా సగటున దాదాపు 25 లక్షల యూనిట్లుగా నమోదవుతున్నాయి. గత మూడేళ్లలో ఈ సంఖ్య వరుసగా 25.03 లక్షలు, 26 లక్షలు, 27 లక్షలుగా ఉందని ఆ అధికారి వివరించారు. దీంతో పన్నులు చెల్లించకుండా ఆ సొమ్ముతో ఎంచక్కా కార్లను కొనేసుకుంటున్నారని తేలిపోయింది. కారు కనీస జీవితకాలం ఏడు సంవత్సరాలైతే, సామాన్యులూ కార్లు కొంటున్నారనుకున్నా.. ఐదేళ్ల లోపటే మరో కారు సామాన్యుడెవరూ కొనరు. అంటే పన్ను ఎగవేతదారులే అధికంగా కార్లను కొనుగోలు చేస్తున్నట్లు తేలిపోయింది. ఇకపోతే ఆదాయ పన్ను గణాంకాలు యేటా కోటి రూపాయలకుపైగా ఆదాయమున్నవారు సగటున 48,417 మంది ఉంటారని చెబుతున్నాయి. అయితే యేటా బిఎమ్‌డబ్ల్యు, జాగ్వార్, ఆడీ, బెంజ్, పోర్షే, మసెరటి వంటి లగ్జరీ బ్రాండ్ల కార్ల విక్రయాలు సుమారు 35 వేల యూనిట్లుగా నమోదవుతున్నాయి. పన్ను ఎగవేతదారులు దేశంలో ఏ స్థాయిలో ఉన్నారో చెప్పడానికి ఈ వివరాలే నిదర్శనం. ఇదిలావుంటే 10 లక్షల రూపాయలకుపైగా వార్షిక ఆదాయం ఉన్నవారు 24.4 లక్షల మందైతే, 50 లక్షల రూపాయలకుపైగా వార్షిక ఆదాయం కలిగినవారు 1.47 లక్షల మంది ఉన్నట్లు ఆ అధికారి చెప్పారు. కాగా, 2014-15 మదింపు సంవత్సరంలో 1.61 కోట్ల మంది పన్నులు చెల్లించినప్పటికీ, ఆదాయ పన్ను రిటర్న్స్‌ను దాఖలు చేయలేదని అన్నారు. ఈ ఏడాది జిడిపిలో ట్యాక్స్ రెవిన్యూ 16.7 శాతంగా ఉంది. అమెరికాలో ఇది 25.4 శాతం, జపాన్‌లో 30.3 శాతంగా ఉంది. కానీ పన్నులు చెల్లించే స్థాయిలో ఆదాయం ఉన్నప్పటికీ భారత్‌లో మాత్రం చెల్లించడం లేదని, వీరందరి నుంచి రావాల్సిన ఆదాయాన్ని ఖజానాకు తరలించే చర్యలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటోందని అధికారి అన్నారు. పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఈ చర్యల్లో భాగమేనన్న సంకేతాలిచ్చారు.