బిజినెస్

సక్రమంగా వినియోగిస్తే.. ప్రజలందరూ పన్నులు కడతారు: మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే అన్ని రంగాలకు నిధులను సమకూర్చాలన్నదే ముందుగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలన్న ఆలోచనకు మూలమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్ము సక్రమంగా వినయోగమైతే సరైన రీతిలో పన్నులు చెల్లించేందుకు వారు వెనుకాడరని మంగళవారం ఇక్కడ జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో స్పష్టం చేశారు. బడ్జెట్ ప్రక్రియను మార్చడం వల్ల నిజమైన రీతిలోనే ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఉంటుందని వెల్లడించారు. సాధారణంగా ప్రతి యేటా ఫిబ్రవరి 28న ప్రవేశపెట్టే బడ్జెట్‌ను వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఫిబ్రవరి 1నే ప్రతిపాదించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. సాధారణ బడ్జెట్‌లో భాగంగానే రైల్వే బడ్జెట్‌ను కూడా ప్రతిపాదిస్తారు. దాదాపు రెండు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో భిన్న అంశాలను ప్రస్తామోదీ ప్రస్తావించారు. కాగా, ఈ సమావేశంలో ఆర్థిక నిపుణులు.. ఆదాయం పన్ను రేట్లను సరళతరం చేయడంతోపాటు వ్యక్తిగత పన్నులను తగ్గించాలని అభిప్రాయపడ్డారు. అలాగే కస్టమ్ సుంకాలను కూడా సహేతుకంగా మార్చాలన్నారు.