బిజినెస్

ఉరకలెత్తిన ఉత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 27: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలను అందుకున్నాయి. గడచిన మూడు వారాల్లో ఎన్నడూ లేనంతగా బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ ఏకంగా 406 పాయింట్లకుపైగా ఎగబాకింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌జేంజ్ సూచీ నిఫ్టీ సైతం దాదాపు 125 పాయింట్లు ఎగిసింది. సోమవారం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్న మదుపరులు.. మంగళవారం కొనుగోళ్లపట్ల ఆసక్తి కనబరిచారు. పన్నుల విధానంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మరోసారి ఇచ్చిన వివరణ మదుపరులను సంతృప్తి పరిచింది. పేర్లలో పెట్టిన పెట్టుబడుల ద్వారా వచ్చే లాభాలపై పన్నులు వేయవచ్చన్న సంకేతాలు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం చేసిన వ్యాఖ్యల ద్వారా మదుపరులకు అందడంతో సోమవారం మార్కెట్లు నష్టపోయాయి. ఆదివారం అలాంటి భయాలేమీ అక్కర్లేదని జైట్లీ చెప్పినప్పటికీ మదుపరులు విశ్వసించలేదు. అయితే సోమవారం మళ్లీ జైట్లీ మాట్లాడుతూ పన్నులు ఆమోదయోగ్యంగా ఉంటేనే బాగుంటుందని, మదుపరులూ చెల్లించడానికి ముందుకు వస్తారన్న అభిప్రాయంతో మార్కెట్ సెంటిమెంట్ బలపడింది. ఈ క్రమంలోనే మెటల్, ఫార్మా, ఎఫ్‌ఎమ్‌సిజి, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, చమురు, గ్యాస్, ఆటో, పిఎస్‌యు, ఐటి రంగాల షేర్లలో పెట్టుబడులు పెట్టేందుకు మదుపరులు ముందుకొచ్చారు. దీంతో సెనె్సక్స్ 406.34 పాయింట్లు పుంజుకుని 26వేల స్థాయికి ఎగువన 26,213.44 వద్ద స్థిరపడితే, నిఫ్టీ 124.60 పాయింట్లు అందుకుని 8వేల స్థాయికి పైన 8,032.85 వద్ద నిలిచింది.
పెరిగిన బంగారం ధర
మరోవైపు బంగారం ధర పెరిగింది. సోమవారం 11 నెలల కనిష్టానికి చేరిన పుత్తడి ధర.. మంగళవారం ఎగిసింది. 10 గ్రాముల 99.9 స్వచ్ఛత కలిగిన పసిడి ధర 475 రూపాయలు పెరిగి 28,025 రూపాయలను తాకింది. కిలో వెండి ధర కూడా 550 రూపాయలు అందిపుచ్చుకుని 39,150 రూపాయలను చేరింది.
రూపాయి విలువ పతనం
ఇకపోతే డాలర్‌తో పోల్చితే రూపాయిమారకం విలువ మంగళవారం మరింత పతనమైంది. 32 పైసలు క్షీణించి 68.06 స్థాయికి చేరింది. సోమవారం 67.74 వద్ద ముగియగా, దిగుమతిదారులు, బ్యాంకర్ల నుంచి డాలర్లకు డిమాండ్ ఏర్పడటంతో మంగళవారం నష్టాలు తప్పలేదు. అంతకుముందు వరుసగా రెండు రోజులు రూపాయి విలువ పెరిగినది తెలిసిందే.